తాజాగా పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ జట్టుపై మాజీలు విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్ బాబర్ ఆజాబ్ నేతృత్వంలో ఐదుగురు బ్యాట్స్ మెన్లు, ఇద్దరు కీపర్లు, నలుగురు ఆల్ రౌండర్లు, నలుగురు బౌలర్లతో మొత్తం 15 మంది సభ్యుల టీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో కొందరిని ఎంపిక చేడయంపై మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా 15 మంది సభ్యులతో కూడిన టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటించగానే హెచ్ కోచ్ మిస్బా ఉల్ హాక్, వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేశారు. కెప్టెన్ బాబర్ ఆజం సైతం జట్టు పై సంతోషంగా లేడనే వార్తలు వినిపించగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అలాంటివేమి లేదని కొట్టిపడేసింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీసీబీ నూతన ఛైర్మన్ రమీజ్ రాజాతో ఈ విషయం గురించి చర్చించిన ఇమ్రాన్ స్క్వాడ్ ను పున పరిశీలించాల్సిందిగా కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఆజం ఖాన్, మహ్మద్ హుసెన్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్ ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ స్థానిక మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో ఫఖార్ జమాన్, షర్జీల్ ఖాన్, షోయబ్ మాలిక్, షెహనవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ లను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 24న దుబాయ్ ఇంటర్నేషన్ లో్ స్టేడియంలో పాకిస్థాన్.. టీమిండియాతో మ్యాచ్ ఆడనుంది.