గంగూలీకి కోల్ కతా హైకోర్టు షాక్..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి కోల్ కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ. 10 వేల జరిమానా విధించింది. గంగూలీకి 2009లో బంగాల్ ప్రభుత్వం స్టాల్ లేక్ లో ప్లాట్ కేటాయించగా 2011 లో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. ఆ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసింది. అయితే 2013లో బెంగాల్ ప్రభుత్వం మళ్లీ కోల్ కతా సమీపంలో గంగూలీకి రెండెకరాల భూమి కేటాయించగా దీనిపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ […]

Written By: Suresh, Updated On : September 28, 2021 2:07 pm
Follow us on

బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి కోల్ కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ. 10 వేల జరిమానా విధించింది. గంగూలీకి 2009లో బంగాల్ ప్రభుత్వం స్టాల్ లేక్ లో ప్లాట్ కేటాయించగా 2011 లో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది. ఆ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసింది. అయితే 2013లో బెంగాల్ ప్రభుత్వం మళ్లీ కోల్ కతా సమీపంలో గంగూలీకి రెండెకరాల భూమి కేటాయించగా దీనిపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సుప్రీంకోర్టు కొట్టివేసిన నిబంధనల కింద మళ్లీ భూమి కేటాయించినందుకు గంగూలీతో పాటు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ లకు జరిమానా విధించింది. కోల్ కతా సమీపంలో ఓ పాఠశాల భవనం నిర్మాణం కోసం గంగూలీకి స్థానిక అధికారులు అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారని కోల్ కతా హైకోర్టు ద్విసభ్యధర్మాసనం తాజాగా తేల్చింది. ఈ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వంతో పాటు హౌసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్ష్చర్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ కు సైతం చెరో రూ. 50 వేల జరిమానా విధించింది.

లబ్ధిదారులు భూమిని తిరిగిచ్చేసినా.. చట్ట ప్రకారం  ఆ కేటాయింపు అక్రమనేనని, దానిని తీసుకోవడమూ అక్రమమేనని ధర్మసనం స్పష్టం చేసింది. కేటాయింపునకు కారణమైన అధికారులు, ఉద్యోగుల నుంచి ఆ జరిమానా మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని సూచించింది. గంగూలీ చట్ట ప్రకారం భూమిని తిరిగిచ్చేసినా.. చట్టం ప్రకారం భూమి మొదట తీసుకోవడం తప్పేనని వ్యాఖ్యానించింది. దేశం ఎప్పుడూ క్రీకాకారులవైపు నిలుస్తోందని, ప్రత్యేకించి అంతర్జాతీయ వేదికలపై ఘనత సాధించిన వారికి అండగా నిలుస్తోందని పేర్కొంది. క్రికెట్ లో దేశం తరఫున గంగూలీ ఎంతో ఘనత సాధించారని, అయితే చట్టం ముందు అవేవీ ఎక్కువ కానది తెలిపింది.