South Korea Martial Law: దక్షిణ కొరియా లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు కొద్దిరోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ న్యూబ్ సమర్థిస్తున్నారు. ఆయన పరిపాలన పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నారు. పైగా అతనిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇది దక్షిణ కొరియా అధ్యక్షుడికి కోపం తెప్పించింది. దీంతో రెండవ మాటకు తావు లేకుండా సైనిక పరిపాలన విధించారు. ఇది అక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. రెండు దేశాలు సరిహద్దు వద్ద భారీగా బలగాలను మొహరింపజేస్తూ ఉంటాయి. నిత్యం బలగాలు పహార కాస్తూ ఉంటాయి. అయితే ఉత్తర కొరియాతో పోల్చి చూస్తే దక్షిణ కొరియా కాస్త మెరుగు. అన్ని రంగాలలోనూ ఉత్తరకొరియా కంటే పై స్థానంలో దక్షిణ కొరియా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో దక్షిణ కొరియా ముందు వరుసలో ఉంటుంది. కొత్త కొత్త ఉత్పత్తులను దక్షిణ కొరియా దేశంలోని సంస్థలు తయారు చేస్తూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు దక్షిణ కొరియాలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ కొరియా అభివృద్ధికి ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సూక్ యోల్ ఎంతగానో కృషి చేశారు.
ప్రతిపక్షాలపై మండిపాటు
దేశంలో ప్రతిపక్షాలు ఉత్తరకొరియా అధ్యక్షుడిపై సానుభూతి వ్యక్తం చేయడంతో యూన్ సూక్ యోల్ కు మండుకొచ్చింది. దీంతో అతడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. “ప్రతిపక్షాలు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని సమర్థిస్తున్నాయి. పైగా అతనిపై సానుభూతిని ప్రకటిస్తున్నాయి. అందువల్లే దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా విధించాల్సి వస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. సొంత దేశాన్ని ప్రేమించాలి. స్వ పరిపాలనను స్వాగతించాలని” యూన్ సూక్ యోల్ పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ టీవీ చానల్స్ ద్వారా ఆయన ప్రకటన చేశారు.
ఆ పని జరుగుతోందా
ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పార్లమెంట్ ను నియంత్రించేందుకు కుట్రలు జరుగుతున్నాయని యూన్ సూక్ యోల్ కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కిమ్ కు అనుకూలంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. అంతేకాదు దక్షిణ కొరియాలోని ప్రతిపక్ష నాయకులకు కిమ్ భారీగా ముడుపులు చెల్లిస్తున్నాడని యూన్ సూక్ యోల్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందువల్లే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించామని ఆయన వివరించారు. దక్షిణ కొరియా రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అనే చట్టం ఉంది. రాజ్యాంగ పరిరక్షణ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని యూన్ సూక్ యోల్ టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉత్తరకొరియా పై సానుభూతి వ్యక్తం చేసే వారెవరూ దక్షిణ కొరియాలో ఉండడానికి అవకాశం లేదని
యూన్ సూక్ యోల్ స్పష్టం చేశారు. అయితే దేశంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why was military rule imposed in south korea what is happening in that country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com