Vishnu statue destroyed: విష్ణుమూర్తిని హిందూ భక్తులు అమితంగా ఆరాధిస్తుంటారు. ఆలయాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తుంటారు. హిందువుల మనోభావాలకు, విష్ణుమూర్తి విగ్రహానికి బలమైన సంబంధం ఉంటుంది. అటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయిలాండ్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా హిందువుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి కీలకమైన విషయాలు వెలుగుచూసాయి.
వివాదాస్పద థాయిలాండ్ – కంబోడియా సరిహద్దు ప్రాంతంలో చొంగ్ ఆన్ వద్ద విగ్రహాలను నిర్మించినట్టు థాయిలాండ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాంతంపై కంబోడియా తనకు సార్వభౌమ అధికారం ఉన్నట్టు ప్రకటించుకుందని.. అది చట్ట విరుద్ధమని.. పై కంబోడియా సైనికులు తమ అనుమతి తీసుకోకుండానే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని థాయిలాండ్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. దీనిపై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది.
ఈ వివాదం నేపథ్యంలో థాయిలాండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్మించిన ప్రాంతం, భద్రత కారణాలవల్లే ఇదంతా జరిగిందని థాయిలాండ్ ప్రభుత్వం పేర్కొంది. థాయిలాండ్ సైన్యం విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. “మా సార్వభౌమాధికారం ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించుకోవడానికి చేసింది. సరిహద్దుల్లో భద్రతను పెంపొందించుకోవడానికి మాత్రమే ఇది చేశామని” థాయిలాండ్ ప్రభుత్వం పేర్కొంది.
విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత కంబోడియా ప్రభుత్వం కూడా స్పందించింది. ” ఆ విగ్రహం కంబోడియా భూభాగంలోని ఆన్ సెస్ ప్రాంతాల్లో ఉంది. 2014లో విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్మించాం. థాయిలాండ్ సరిహద్దు నుంచి దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఈ విగ్రహం నిర్మించాం. ఆ విగ్రహం బౌద్ధులు, హిందువులు పూజించే ప్రాంతం. వివాదాస్పదమైన థాయిలాండ్- కంబోడియా సరిహద్దు ప్రాంతంలో చొంగ్ – ఆన్ వద్ద థాయిలాండ్ ప్రభుత్వం విగ్రహం నిర్మించింది. మా అనుమతి లేకుండానే చట్ట విరుద్ధంగా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకుందని” ప్రీహ్ విహార్ ప్రతినిధి లిమ్ చాన్ పాన్హా వెల్లడించారు.
మరోవైపు ఈ వివాదంపై భారతదేశం స్పందించింది. రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది. జరిగిన సంఘటనకు మతాన్ని జోడించకూడదని సూచించింది. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని భారత ప్రభుత్వం పేర్కొంది. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడాలని, ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలని భారత్ సూచించింది. కాగా, కంబోడియా, థాయిలాండ్ మధ్య సైనిక ఘర్షణలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ మళ్ళీ ఈ నెలలో వివాదం మొదలైంది.
#Thailand brought down Lord Vishnu statue, I want to start the “Boycott Thailand” and “Boycott Pattaya” campaigns
Hope my Hindu brethren support this cause by canceling bookings and ensuring that country is brought to its knees and forced to beg before India
Challenge accepted? pic.twitter.com/uLClYbblun
— Raghav / Tau (@palwai) December 24, 2025