Homeఅంతర్జాతీయంChina: ప్రైవేట్ జాబులు వద్దు.. ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు.. చైనాలో ఎందుకీ మార్పు?

China: ప్రైవేట్ జాబులు వద్దు.. ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు.. చైనాలో ఎందుకీ మార్పు?

China: చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం. చైనాలో జనాభా ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. కానీ, ఉన్న జనాభాకు కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఆర్థికంగా అభివృద్ది చెందుతున్న చైనాలో నిరుద్యోగ రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా చైనా జాతీయ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు రికార్డు స్థాయిలో 37 లక్షల మంది హాజరయ్యారు. టాప్‌ కాలేజీల గ్రాడ్యుయేట్లు కూడా పోటీ పడ్డారు. 2026కి అందుబాటులో ఉన్నవి కేవలం 38 వేలఉద్యోగాలు మాత్రమే. అంటే ఒక్కో పోస్టుకు 100 మంది పోటీ పడ్డారు. ప్రస్తుతం ప్రైవేటురంగంలో అనిశ్చితి కారణంగా మన దేశంలో లాగానే ప్రభుత్వ కొలువులకు చైనా యువత కూడా పోటీ పడుతోంది.

ప్రైవేట్‌ రంగం మాంద్యం…
చైనాలో 16–24 ఏళ్ల వారిలో నగరాల్లో నిరుద్యోగం జూలై నుంచి 17 శాతాన్ని దాటింది. అమెరికా వంటి దేశాల్లో దీని స్థాయి చాలా తక్కువ. వ్యాపారాలు ఆకర్షణ కోల్పోయి, ఆర్థిక స్థిరత్వం కుంగిపోవడంతో ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు అర్ధంగా అయిపోయాయి. రెగ్యులేషన్లు రియల్టీ, టెక్నాలజీ, ట్యూషన్‌ రంగాలు నష్టాల్లో ఉన్నాయి. టాప్‌ 500 ప్రైవేట్‌ ఫిర్ములు 3.14 లక్షల ఉద్యోగాలను తొలగించాయి. దీంతో యువకులు అధిక వేతనాలకు బదులు భద్రతను ఎంచుకుంటున్నారు.

పాత ఆకర్షణ తిరిగి..
వేగవంతమైన ఆర్థిక బూమ్‌లో అలిబాబా, టెన్సెంట్‌లా కంపెనీలు యువతను ఆకర్షించాయి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌లో మలుపు 2020లో 25 శాతం గ్రాడ్యుయేట్లు ప్రైవేట్‌ ఉద్యోగాలు కోరుకున్నారు. 2023కి అది 12.5 శాతానికి పడిపోయింది. ప్రైవేట్‌ రంగంపై నిరాశ, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌ కోరిక. ’ఐరన్‌ రైస్‌ బౌల్‌’ అన్న ప్రభుత్వ ఉద్యోగాలు మళ్లీ పాపులర్‌ అవుతున్నాయి.

ఉన్నత విద్యపై తగ్గిన ఆసక్తి..
అక్టోబర్‌ జాతీయ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ పరీక్షకు 34 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2023 గరిష్ఠంగా 47.4 లక్షల నుంచి క్షీణత. ఉన్నత డిగ్రీలు ఉద్యోగ హామీ ఇవ్వవని యువత గ్రహించారు. ఆర్థిక ఒత్తిళ్లలో అభిలాషల కంటే ఉద్యోగ భరోసా ముందుకు వచ్చింది.

ఈ మార్పు చైనా యువతలో ఆకాంక్షలను మెరుగుపరచలేదు. ప్రభుత్వ రంగం డిమాండ్‌ పెరిగింది. భవిష్యత్తులో ఇది ప్రైవేట్‌ ఇన్నోవేషన్‌ను బలహీనపరచి, దేశీయ ఆర్థిక పునరుజ్జీవనానికి అడ్డుకట్టగా మారవచ్చు. యువ శక్తి స్థిరత్వం వైపు మళ్లడం చైనా భవిష్యత్‌ వృద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version