https://oktelugu.com/

Canada : టెస్లా కారులో ప్రయాణిస్తుండగా దారుణం.. నలుగురు భారతీయుల దుర్మరణం.. ఇంతకీ ఏం జరిగిందంటే..

వారంతా భారతీయులు. ఉన్నత చదువులు చదివి.. గొప్ప ఉద్యోగాలు చేయాలని కెనడా వెళ్లారు. అక్కడ పగలనకా రాత్రనకా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో అనుకోని దారుణం వారి జీవితాలను సర్వనాశనం చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 26, 2024 / 02:29 AM IST

    Road accident in canada

    Follow us on

    Canada : కెనడాలోని టొరంటో నగరం సమీపంలో దారుణం చోటు చేసుకుంది. టొరంటో నగరం సమీపంలో గురువారం అర్ధరాత్రి దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ టెస్లా కారు నుంచి విపరీతమైన మంటలు, పొగలు వచ్చాయి. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ నలుగురిలో ఇద్దరు గుజరాత్ రాష్ట్రంలోని గోద్రా ప్రాంతానికి చెందినవారు. గోద్రాకు చెందిన 30 సంవత్సరాల కేత గోహిల్, 26 సంవత్సరాల నిల్ గోహిల్.. మరో ఇద్దరు వ్యక్తులు టెస్లా కారులో ప్రయాణం సాగిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న టెస్లా కారు టొరంటో నగరం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ కారు ప్రయాణిస్తున్న సమయంలో ఓ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు బ్యాటరీ తీవ్రంగా దెబ్బతిన్నది. కారు ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో బ్యాటరీ నుంచి మంటలు చెదిరేగాయి. మంటలు ఉదృతం అవడంతో కారుల ప్రయారిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్న మిగతావారు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మంటలు అంతకంతకు ఎగిసి పడటంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది . ఫలితంగా నలుగురు భారతీయులు దుర్మరణం చెందాల్సి వచ్చింది. అయితే చనిపోయిన నలుగురిలో ఇద్దరు ఇటీవల కెనడా నుంచి పౌరసత్వాన్ని పొందారు.

    వేగమే ప్రమాదానికి కారణమా

    అయితే ఆ నలుగురు ప్రయాణిస్తున్న టెస్లా కారు విపరీతమైన వేగంతో వెళ్తోంది. అలా వేగంతో వెళ్లడం వల్లే డివైడర్ ను ఢీకొట్టింది. ఢీ కొట్టిన వెంటనే కారులో ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అది ఎలక్ట్రికల్ వెహికల్ కావడంతో అంతర్గతంగా ఘర్షణ ఏర్పడింది. అది కాస్త మంటలు ఏర్పడడానికి కారణమైంది. అలా మంటలు ఏర్పడి కారు మొత్తం ఒక్కసారిగా అంటుకుంది. మంటలు వెంటనే వ్యాపించడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు బయటికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ మంటల్లో వారు చిక్కుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. ఎలక్ట్రికల్ కారు కావడంతో మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు..” ఆ మార్గంలో టెస్లా కారు వేగంగా ప్రయాణిస్తున్నది. దానివేగం నియంత్రణలోకి రాలేదు. దీంతో కారు తోలుతున్న వ్యక్తి డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో ఆ కారు ప్రమాదానికి గురైంది. వెంటనే మంటలు వ్యాపించాయి. నేను చూస్తుండగానే అందులో ఉన్న నలుగురు చనిపోయారు. వారిని కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. అయితే వారిలో ఇద్దరికీ ఇటీవల కెనడా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ఆ కారును తొలగించారు. కాలిపోయిన ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది. ఇటువంటి ఘటన నేను ఇంతవరకు చూడలేదని” ఓ ప్రత్యక్ష సాక్షి కెనడా మీడియాతో వ్యాఖ్యానించాడు.