Justin Trudeau : ట్రూడోకు షాక్‌.. కెనడా ప్రధానిపై సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటు.. దిగిపోవాలని డెడ్‌లైన్‌!

ఉగ్రవాది హత్యను అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు కెడనా ప్రధాని జస్టిన్‌ ట్రూడో. భారత హైకమిషన్‌ ప్రతినిధులే ఉగ్రవాదిని హత్య చేయించారని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు. అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్న ట్రూడోకు సొంతపార్టీ ఎంపీలే షాక్‌ ఇచ్చారు.

Written By: Raj Shekar, Updated On : October 25, 2024 10:52 am

Justin Trudeau

Follow us on

Justin Trudeau : కెనడాలోని భారతీయుల ఓట్ల కోసం భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు కెడనా ప్రధాని జస్టిన్‌ ట్రూడో. సిక్కు వేర్పాటు వాది. ఖలిస్తానీ ఉగ్రవాని హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యను ఇందుకు వాడుకుంటున్నారు. భారత రాయబారా కార్యాలయ సంస్థ ప్రతినిధులే నిజ్జర్‌ను హత్య చేశారని ఆరోపించారు. దీనికి ఆధారాలు ఇవ్వాలని భారత్‌ కోరినా ఆధారాలు ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు. గతేడాది ప్రారంభమైన గొడవ ఇటీవల తారాస్థాయికి చేరింది. దౌత్య సంబంధాలను దెబ్బతీసింది. ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్‌ కెనడాలోని రాయబారులను వెనక్కు పిలిపించింది. ఇదే సమయంలో భారత్‌లోని కెనడా రాయబారులను బహిష్కరించింది. ఇలా ఇరు దేశాల మధ్య గొడవకు కారణమైన ట్రూడోకు తాజాగా సొంత పార్టీనేతలే షాక్‌ ఇచ్చారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని 24 లిబరల్‌ పార్టీ ఎంపీలు డెడ్‌లైన్‌ విధించారు. అక్టోబర్‌ 28 నాటికి రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఈమేరకు ఓ క్లోజ్డ్‌ డోర్‌ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎంపీలు ట్రూడోపై అసంతృప్తిని, అసమ్మతిని వ్యక్తం చేశారు.

ఆయన సారథ్యంలో ఎన్నికలకు వద్దు..
వచ్చే ఎన్నికల్లో ట్రూడో సారథ్యంలో పోటీ చేయలేమని ఎంపీలు పేర్కొంటున్నారు. ఆయన సారథ్యంలో ఎన్నికలకు వెళితో గెలుపు కష్టమే అని అంటున్నారు. ఈమేరకు లేఖ రాశారు. ఈ లేఖపై 153 ఎంపీల్లో 24 మంది ఎంపీలు సంతకాలు చేశారని బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. ఇప్పటికే మైనారిటీలో ఉన్న ట్రూడో సర్కార్‌పై 24 మంది తిరుగుబాటు చేయడం మరింత ఇబ్బందిగా మారింది. అయితే పార్టీ ఎంపీ ఎరిస్కిత్‌ స్మిత్‌ మాట్లాడుతూ పరిస్థితులను చక్కదిద్దడానికి ట్రూడోకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. అసంతృప్తివాదుల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు.

పాత విషయమే..
ఇదిలా ఉంటే.. ఇమ్మిగ్రేషన్‌ శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్‌ మాట్లాడుతూ కొంతమంది లిబరల్‌ పార్టీ ఎంపీలు ట్రూడోపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఇది పాత విసయమే అని పేర్కొన్నారు. దీనిని ప్రజలు బయటపెట్టడం అవసరమన్నారు. ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయాన్ని ఎంపీలు నిజాయతీగా ప్రధానికి వెల్లడించారన్నారు. ఆయనకు వినడం ఇష్టం ఉన్నా లేకపోయినా వారు చెప్పేది చెప్పారని వ్యాఖ్యానించారు. మరోవైపు ట్రూడో మద్దతుదారులు మాత్రం ప్రభుత్వానికి ఎలాండి ఇబ్బంది లేదంటున్నారు. తాము బలంగా ఉన్నామని, సమష్టిగా ఉన్నామని పేర్కొంటున్నారు. ట్రూడో నాయకత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు.