https://oktelugu.com/

కేకేఆర్ పై పంజాబ్ విజయానికి కారణమేంటి?

ఐపీఎల్ సీజన్-2లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంలు దుబాయ్ లో తలపడిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.అయితే ఛేదనలో పంజాబ్ కు శుభారంభం దక్కింది. రాహుల్ ఆరభంలో నెమ్మదిగానే ఆడినా మయాంక్ మరో ఎండ్ లో జోరు చూపించాడు. తొలి వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. అయితే వేగండా ఆడే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 2, 2021 / 09:02 AM IST
    Follow us on

    ఐపీఎల్ సీజన్-2లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ టీంలు దుబాయ్ లో తలపడిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.అయితే ఛేదనలో పంజాబ్ కు శుభారంభం దక్కింది. రాహుల్ ఆరభంలో నెమ్మదిగానే ఆడినా మయాంక్ మరో ఎండ్ లో జోరు చూపించాడు. తొలి వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు.

    అయితే వేగండా ఆడే క్రమంలో పూరన్ ఔటయ్యాడు. కానీ ఆఖరి ఓవర్ లో 5 రన్స్ కావాల్సిన దశలో రెండో బంతికి రాహుల్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే మూడో బంతిని షారుక్ డీప్ మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేపాడు. బౌండరీ లైన్ దగ్గర త్రిపాఠి ఆ బంతిని పట్టుకున్నా బ్యాలెన్స్ చేయలేక వదిలేయడంతో అది సిక్సర్ గా వెళ్లింది. దీంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది.

    అయితే ఈ మ్యాచ్ పై కేఎల్ రాహుల్ స్పందించాడు. ఈ మ్యాచ్ మా జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ మ్యాచ్ లో మేమే చాలా తెలివిగా ఆడామని తెలిపాడు. మేం ముందుగా కాస్త మెల్లిగా ఆడాం. తర్వాత దూకుడు పెంచామని తెలిపాడు. అయితే ఈ విజయం మాకు ఆత్మవిశ్వాస్వాన్ని పెంచుతుందని అన్నాడు. భారత క్రికెటర్లను పక్కన పెట్టడం ఒక కెప్టెన్ గా నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయనా,మనసు పెద్దది చేసుకొని హర్ ప్రీత్ ను పక్కన పెట్టమని తెలిపాడు.

    అలాగే ఈ మ్యాచ్ పై కోల్ కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ మొదట మేం అంత బాగా ఫీల్డింగ్ చేయలేదు. నాతో పాటు ఇతరులు క్యాచ్ లు వదిలేశారు. మేం వెనుకబడటానికి అవే కారణం. చివర్లో మ్యాచ్ అంత రసవత్తంగా మారినప్పుడు రెండు, మూడు వికెట్లు పడితే వాళ్లపై ఒత్తడి పెరిగి మాకు ఉపయోగపడేది. 19 ఓవర్ లో రాహుల్ ఔటయ్యాడనుకున్నా.. కానీ మనం థర్డ్ అంఫైర్ నిర్ణయాన్ని గౌరవించాలి. ఒక వేళ ఆ వికెట్ దక్కింటే మాకు విజయం అవకాశం ఉండేది. ఇక వెంకటేశ్ అయ్యర్ గురించి మాట్లాడుతూ అతడు అమూల్యమైన ఆటగాడు. ఏ మాత్రం భయపడకుండా తన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడని తెలిపాడు.