Tsunami20: బంగాళాఖాతంలో ఇటీవల మరోసారి తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలోని గుంటూరు జిల్లాలో వర్షం కురిసింది. మరికొన్ని మరికొన్ని జిల్లాలతో పాటు తెలంగాణలోని వర్షం వాతావరణం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం వర్షకాలం కాకపోయినా వర్షం వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కానీ డిసెంబర్ అనగానే మనకోటి గుర్తుకు వస్తుంది. అదీ 26వ తేదీ అంటే హిందూ మహాసముద్రం తీర ప్రాంతాలకు వణుకు పుడుతుంది. ఎందుకంటే 2004 డిసెంబర్ 26వ తేదీన సంభవించిన సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘోర విపత్తులో 2 లక్షలకు పైగా ప్రజలు మరణించారు. అనేక మంది ఉపాధిని కోల్పోయారు. శ్రీలంక దరిదాపుల్లో ఉన్న వారు ఇప్పటికీ కోలుకోవడం లేదు. అయితే అప్పుుడు ఇంత విపత్తును మందే గుర్తించలేదా? ఇప్పుడెలా గుర్తిస్తున్నారు? అప్పటికీ, ఇప్పటికీ వాతావరణ సమాచారం లో ఎటువంటి మార్పులు వచ్చాయి? ఆ వివరాల్లోకి వెళితే..
2004 డిసెంబర్ 26న.. ఇండోనేషియా తీర ప్రాంతంలోని సముద్ర గర్భంలో 9.1 తీవ్రతతో మహా విస్పోటనం జరిగింది. దీంతో ఇండోనేషియాతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, శ్రీలంకతో పాటు భారతదేశంలోని తీర ప్రాంతాల్లో సునామీ విజృంభించింది. ఎత్తైన అలలతో సంభవించిన ఈ సునామీతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ సమయంలో సరైన వాతావరణ సమాచారం లేదు. సముద్ర గర్భంలో భూకంపం సంభవించిన 20 నిమిషాల్లోనే అండమాన్ నికోబార్ దీవుల నుంచి చెన్నైతీరాన్ని తాకింది.శ్రీలంకకు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పడిన ఈ విస్పోటనం గుర్తించడంలో ఆలస్యమంది. హైదరాబాద్ లోని నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) ఉన్నప్పటికీ సూదూర ప్రాంతాల సమాచారం సేకరించడంలో టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు. ఆ సమయంలో ఎక్కువగా అంతర్జాతీయ డేటాపై ఆధారపడేవారు.
కానీ అప్పటికీ, ఇప్పటికీ వెదర్ రిపోర్టు సేకరించడంలో ఇండియా పురోగతి సాధించింది. ఈ సునామీ తరువాత ఎట్టకేలకు ‘భారత విపత్తు నిర్వహణ చట్టం’ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత హైదరాబాద్ లో 2007 అక్టోబర్ లో ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్(ITEWC) ఏర్పాటు చేశారు. ఇది భూకంప పర్యవేక్షణ, సముద్ర స్థాయి నెటవర్క్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది హిందూ మహా సముద్రంతో పాటు ప్రపంచంలో ని సముద్రాల్లోని ఏర్పడే సునామిజెనిక్ భూకంపాలను కేవలం 10 నిమిషాల్లోనే గుర్తిస్తుంది. అంతేకాకుండా ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ (IOC-UNESCO) ప్రేమ్ వర్క్ లో భాగంగా భారత్ 26 దేశాలకు సునామీ సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది.
ఇండియాలోని తీర ప్రాంతంలోని గ్రామాలకు సునామీ హెచ్చరికలను జారి చేయడానికి ఇది పనిచేస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి రక్షణ చర్యలు తీసుకోబోతున్నారు. ITEWC నుంచి సమాచారం వచ్చిన తరువాత GIS మ్యాప్ కు సంబంధించిన వివరాలు నేరుగా మొబైల్ లోకి పంపించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2023లో సిక్కింలో గ్లైసియల్ లేక్ ఔట్ బర్డ్స్ ఫ్లడ్ వంటి ప్రమాదాల నుంచి తప్పించడానికి ఇది ఉపయోగపడింది.