Mono Lake : సాధారణంగా సరస్సులు అంటే అందరికీ ఇష్టమే. వీటిని చూడటానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన సరస్సులు ఉన్నాయి. ఒక్కో సరస్సు ఒక్కో దానికి ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇందులో కొన్ని డేంజర్ సరస్సులు కూడా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉండే కొన్ని అందమైన సరస్సులో మానవులకు హాని కలిగించే సరస్సులు కూడా ఉన్నాయి. అందులో మోనో సరస్సు ఒకటి. ఇది ఉత్తర అమెరికాలో ఉంది. ఇది ఒక టెర్మినల్ సరస్సు. ఈ సరస్సు ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఈ సరస్సులో ఎక్కువగా లవణాలు ఉన్నాయి. ఇవి ఇందులోని వాటర్‌ను ఆల్కలీన్‌గా చేయడంతో మానవులకు విషంగా మారింది. అవుట్‌లెట్ లేకపోవడం వల్ల ఈ సరస్సులో ఎక్కువగా లవణాలు ఉండిపోయాయి. ఇందులో కార్బోనేట్, బైకార్బోనేట్ వంటి రసాయనాలు ఉన్నాయి. ఇవి మానవులకు హాని కలిగిస్తాయి. అందుకే ఈ సరస్సును మానవులకు విషంగా భావిస్తారు.
మోనో సరస్సులోకి వివిధ ప్రదేశాల నుంచి నీరు వచ్చి చేరుతుంది. నీరు ఎక్కడికి వెళ్లకపోవడం వల్ల లవణాలు, ఖనిజాలు అధిక సాంద్రతలు ఉంటాయి. ఇది లాస్ లాస్ ఏంజిల్స్ నగరానికి 300 మైళ్ల దూరంలో ఉంది. అయితే 1941 నుంచి మోనో సరస్సు నుంచి నీటిని బయటకు పంపిస్తున్నారు. కానీ వీటి లవణీయత మాత్రం తగ్గడం లేదు. ఈ సరస్సులో నీరు సముద్రం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఉప్పుగా ఉంది. ఇందులో 80 రెట్లు ఆల్కలీన్ ఉంది. ఈ సరస్సులో ఉండే లవణీయత వల్ల చాలా తక్కువ జంతువులు ఇందులో జీవిస్తున్నాయి. ఇక్కడ 80 లక్షల కంటే ఎక్కువ పక్షులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా వలస వచ్చిన పక్షులే ఎక్కువగా ఉన్నాయి. ఈ సరస్సులోకి పెద్దగా మనుషులు వెళ్లరు. ఈ సరస్సు మానవునికి ప్రమాదకరంగా మారింది. ఇందులోని రసాయనాల వల్ల మనుషుల ఆరోగ్యానికి హానికరం చేస్తోంది. అందుకే ఈ సరస్సు మానవులకు విషంగా మారింది.
ఈ మోనో సరస్సు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువగా ఫొటోగ్రాఫర్లు వెళ్తుంటారు. ఎవరు ఈ ప్రదేశానికి వెళ్లినా కూడా చాలా ఆహ్లాదకంగా అనిపిస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ సరస్సు పక్షుల మధ్య చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఈ సరస్సు దగ్గర శిలలు కూడా ఉంటాయి. కొందరు వీటిని మోనో రాక్స్ అని అంటారు. ఈ సరస్సులోని నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందరో ప్రకృతి ప్రియులు ఇక్కడికి వచ్చి ఫొటోలు తీసుకుంటూ సేద తీరుతారు.