Homeఅంతర్జాతీయంIran vs USA conflict : అమెరికన్లను తాకిన యుద్ధ సెగ.. అగ్రరాజ్యంలో చమురు మంటలు!

Iran vs USA conflict : అమెరికన్లను తాకిన యుద్ధ సెగ.. అగ్రరాజ్యంలో చమురు మంటలు!

Iran vs USA conflict : పశ్చిమాసియా యుద్ధం మొదలై నెల దాటింది. ఇరాన్‌ మాత్రం అమెరికాకు లొంగడం లేదు. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. హర్మూజ్‌ జల సంధి మూసివేయడంతో చమురు, సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు ధరలు చాలా దేశాల్లో పెరిగాయి. ఇక యుద్ధం ప్రారంభించిన అమెరికాకు కూడా ఇప్పుడు యుద్ధ సెగలు తాకుతున్నాయి. తాజాగా చమురు ధరలు పెరుగుతున్నాయి. 20222 ఆగస్టు తర్వాత అమెరికాలో చమురు ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు..
అమోరికాలో యుద్ధం కారణంగా చమురు కంపెనీలు ధరలు పెంచేశాయి. అవి నేరుగా భారాన్ని ప్రజలపై మోపుతున్నాయి. పెట్రోల్‌ ఒక గ్యాలన్‌ పెట్రోల్‌ ధర 3.09 డాలర్ల నుంచి ఏకంగా 4.09 డాలర్లకు పెంచాయి. అంటే గ్యాలన్‌కు ఒక డాలర్‌ కన్నా ఎక్కువ పెరిగింది. లీటరుకు లెక్కిస్తే దాదాపు రూ.100 పెరిగింది. ఇక డీజిల్‌ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గ్యాలన్‌కు 3.04 డాలర్లు ఉన్న ధర, ఇప్పుడు 5.33 డాలర్లకు పెరిగింది. అంటే 75 శాతం పెరుగుదల నమోదైంది. ముడి చమురు యుద్ధానికి ముందు బ్యారెల్‌కు 60–70 డాలర్లు ఉండగా ఇప్పుడు 100–120 డాలర్ల శ్రేణికి చేరింది. అంటే 50 నుంచి 60 శాతం పెరిగింది.

హర్మూజ్‌ జలసంధి మూసివేత
అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ తన అస్త్రశస్త్రాగారంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించింది. హర్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో ప్రపంచంలోని మొత్తం చమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. రోజుకు 21 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురు ఇక్కడి నుంచి ప్రపంచానికి సరఫరా అవుతుంది. భారత్‌ తన ముడిచమురు దిగుమతుల్లో 60 శాతం ఈ మార్గం గుండానే తెచ్చుకుంటుంది. యుద్ధం కారణంగా రూ.10 వేల కోట్ల విలువైన భారత నౌకలు ఈ జలసంధిలో చిక్కుకున్నాయి.

అమెరికాకు షాక్‌..
అమెరికా కూడా గల్ఫ్‌ నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. జలసంధి మూసివేతతో సరఫరా గొలుసు దెబ్బతిని, ధరలు పెరిగాయి. యుద్ధం మొదలుపెట్టిన అమెరికా, తన ప్రజలపైనే భారం వేస్తోంది. కానీ భారత్‌ ప్రభుత్వం మాత్రం ప్రజలను కాపాడుకుంటోంది. అమెరికా కంటే 4 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న భారత్, యుద్ధం ప్రభావాన్ని తట్టుకుంది. భారత్‌ భారీ ఎత్తున చమురు నిల్వలు చేసుకుంది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి, నిల్వలు పెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించి, ఆయిల్‌ కంపెనీలకు రిలీఫ్‌ ఇచ్చింది. దీంతో ధరలు పెరగకుండా చూసింది. భారత్‌ కేవలం గల్ఫ్‌ పైనే ఆధారపడకుండా, రష్యా, అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం సరఫరాను మెరుగుపర్చి, కొరత రాకుండా చూసింది.

గల్ఫ్‌ యుద్ధాన్ని మొదలుపెట్టిన అమెరికా, ఇప్పుడు తన ప్రజలపైనే భారం వేసుకుంటోంది. పెట్రోల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మరోవైపు భారత్‌ మాత్రం, ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించి, సరఫరాను మెరుగుపర్చి, ప్రజలను కాపాడుకుంటోంది. యుద్ధం మొదలుపెట్టిన అమెరికా తన ప్రజలను బాదడం ప్రారంభించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version