Cameron Green IPL : అంతన్నాడు ఇంతన్నాడే బాలరాజు.. ఇంటికొచ్చి ముసుగు తన్ని పన్నాడే బాలరాజు.. ఈ పాట ఈ ఆటగాడికి నూటికి నూరు శాతం కాదు కోటి శాతం సరిపోతుంది. ఐపీఎల్ అంటేనే వేగానికి పరాకాష్ట. ఎన్ని పరుగులు కొట్టినా సరే.. బ్యాటర్ల దాహం. ఎందుకంటే బంతి బ్యాట్ మీదకి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బ్యాటర్లు ఎందుకు ఊరుకుంటారు.. దుమ్ము రేపి వదిలిపెడతారు. కసి కొద్ది బంతిని కొట్టి పరుగులు తీస్తుంటారు. ఐపీఎల్ లో అందరు బ్యాటర్లు అనుసరించే సూత్రం ఇదే.
కొందరు బ్యాటర్లు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. అలాగని వీరు ఏమైనా ఐపీఎల్లో తక్కువ తీసుకుంటారా అంటే.. కోట్లకు కోట్లు తమ ఖాతాలో వేసుకుంటారు. అదేం దరిద్రమో విదేశీ ప్లేయర్లు కనిపించగానే ఐపిఎల్ యాజమాన్యాలకు విపరీతమైన యాంగ్జైటీ ఉంటుంది. వారు అదరగొడతారని.. ఇండియన్ మైదానాలపై బౌలర్లను బెదరగొడతారని.. మైదానంలో పరుగుల ప్రవాహం సాగిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి అంత డొల్ల.
ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు బలమైన నేపథ్యం ఉంది. ఈ జట్టుకు యజమానిగా షారుక్ ఖాన్ ఉన్నాడు. 2024లో ఈ జట్టు విజేతగా కూడా నిలిచింది. 2025 సీజన్ కు వచ్చేసరికి తేలిపోయింది. ప్రస్తుత సీజన్లో ఎలాగైనా సరే ట్రోఫీ అందుకోవాలని షారుఖ్ ఖాన్ జట్టు బలంగా అనుకొంది. అందువల్లే గత ఏడాది చివర్లో జరిగిన మెగా వేలంలో ఏకంగా 25.20 కోట్లతో గ్రీన్ అనే ఆటగాడిని షారుక్ కొనుగోలు చేశాడు. అంతేకాదు ఈసారి ట్రోఫీ మాదే అంటూ సంకేతాలు ఇచ్చాడు.
గ్రీన్ మీద భారీగా పెట్టుబడి పెట్టిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు తలవంచుకున్నాడు. ఎందుకంటే గ్రీన్ బ్యాట్ తో ఆకట్టుకోవడం లేదు. కనీసం బంతిని పట్టుకొని బౌలింగ్ కూడా వేయడం లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. ఒకరకంగా అతనికంటే విజిటింగ్ ప్రొఫెసర్ నయం. 25 కోట్లకు పైగా నగదు తీసుకొని.. కనీసం తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నాడు గ్రీన్. అందువల్లే అతడి ఆట తీరు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
2024లో ట్రోఫీ గెలిచినప్పుడు జట్టులో ఉన్న వెంకటేష్ అయ్యర్.. శ్రేయస్ అయ్యర్.. పూరన్ వంటి ప్లేయర్లు ఇప్పుడు షారుక్ ఖాన్ జట్టులో లేరు. వారిని ఇతర జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. వారిని నిలుపుకోవడంలో షారుక్ ఖాన్ పూర్తిగా విఫలమయ్యాడు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి.. గ్రీన్ అనే ఆటగాడిని తీసుకొస్తే.. అతడు కోల్ కతా ను ఎండబెడుతున్నాడు.