డాషింగ్ ఓపెనర్, మాజీ కెప్టెన్ వార్నర్ లేకుండానే హైదరాబాద్ విజయం అందుకుంది. డేవిడ్ వార్నర్ ను పక్కన బెట్టి సన్ రైజర్స్ సత్ఫలితాలను అందుకుంది. మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా అభిమాని ఇచ్చిన ప్రశ్నకు వార్నర్ సమాధానంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డేవిడ్ వార్నర్ స్టేడియంలో ఉన్నాడా? అతను కనిపించట్లేదంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దాన్ని డేవిడ్ వార్నర్ కు ట్యాగ్ చేశాడు. అతనికి వార్నర్ సమాధానం ఇచ్చాడు.

దురదృష్టవశాత్తూ అది మళ్లీ జరగదు. సపోర్ట్ చేయండి అంటూ రిప్లయ్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో ఇక డేవిడ్ వార్నర్ ఆడబోడనే విషయాన్ని అతను చెప్పకనే చెప్పడనే అంటున్నారు. ఫ్రాంచైజీ వివరణ ఎలా ఉన్నప్పటికి అంతర్గత విభేధాల కారణంగానే అతడిపై వేటు పడిందన్నది వాస్తవం. ఇప్పుడిప్పుడే అతడికి ఆడే ఆవకాశం రాకపోయినా ఆశ్చర్యం లేదు. అయితే ఐపీఎల్ మొదటి సీజన్ లో హైదరాబాద్ టీమ్ కు కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ను తప్పించారు. కనీసం ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు.
భుజంపై తువ్వాలు వేసుకుని.. తోటి ఆటగాళ్లకు డ్రింగ్స్ అందిస్తూ జట్టు మంచి ప్రదర్శన చేసినప్పడల్లా చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ కనిపించాడు. తనను తప్పించిన బాధను అతడు ఎక్కడ కనిపించకుండా సరదాగా తిరిగాడు. ఐపీఎల్ లో ఏజట్టుకు ఆడినా ఫామ్ ఆధారంగా వార్నర్ ను పక్కన పెట్టడం బహుశా ఇదే తొలిసారి. అయితే చివరిగా ఆడిన రెండు మ్యాచ్ ల్లో వార్నర్ విఫలమయ్యాడు.