India Vs Pakistan War: మరికొద్ది గంటలలో 2025 కాలగర్బంలో కలిసిపోతుంది. 2026 మొదలవుతుంది. ఒక ఏడాది మొదలవుతుందంటే అనేక రకాలైన చర్చలు తెరపైకి వస్తాయి.. ఆర్థికం నుంచి సామాజికం అనే అంశాలపై విస్తృతంగా మదనం జరుగుతుంది. కొందరు భవిష్యత్తు అంశాలను ముందుగానే ప్రస్తావిస్తారు.. ప్రస్తుత వర్తమానాన్ని భవిష్యత్తు కాలానికి జోడించి.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ముందే చెప్తారు. ఇలా భవిష్యత్తు కాలాన్ని అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ ముందుగానే ఊహించింది.. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతుందో ముందే చెప్పింది.
2025లో పాకిస్తాన్ భారత్ మీద కవ్వింపులకు దిగింది. తన అనుకూలమైన ఉగ్ర మూకలతో పహాల్గాం దాడికి పాల్పడింది. పచ్చటి కాశ్మీర్లో నెత్తుటి ఏర్లను పారించింది. దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. తద్వారా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్ సైన్య శక్తిని.. ఆయుధ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు కూడా రుచి చూపించింది.
ఆపరేషన్ సిందూర్ ఒకరకంగా పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించింది. అయితే అంతర్జాతీయంగా పరిస్థితులు వేగంగా మారిపోవడంతో పాకిస్తాన్ బతికి బట్టకట్టింది. లేకపోతే ఈ సమయానికి ప్రపంచ పటంలో లేకుండా పోయేది. ఆపరేషన్ సిందూర్ తోనే భారత్ ఆగదని.. ఆ తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
2026 సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ప్రకటించింది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయని.. అందువల్ల భారత్ వారిపై ఒత్తిడి తీసుకొస్తుందని.. అవసరమైతే యుద్ధం కూడా చేస్తుందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ పర్సన్ చేసింది. పహల్గాం దాడి.. ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాలు ఉద్రిక్తతలకు దారితీసాయని.. ఇవి 2026లో యుద్ధానికి కారణమవుతాయని పేర్కొంది.
రెండు దేశాలు ఆయుధాల సమీకరణ వేగవంతం చేయడం ఆందోళన కలిగిస్తోందని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ పేర్కొంది. ” మరొక రోజు వ్యవధిలో 2026 ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దేశాలు ఆయుధాల సమీకరణ ను చేపట్టాయి. ఈ పరిణామాల ప్రకారం చూసుకుంటే ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. యుద్ధం జరిగితే మాత్రం ఆ పరిణామాలు ప్రపంచం మీద వేరే విధంగా ఉంటాయని” కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ స్పష్టం చేసింది.