Gold And Silver Prices: బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విలువైన లోహాలను కొనుగోలు చేయాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక మనదేశంలో బంగారం, వెండి విక్రయాలకు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు ప్రఖ్యాతి గాంచినవి.
మంగళవారం కూడా రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ రేట్లు వెండి రికవరికి దారితీసింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) లో బంగారం కొనుగోలు స్థిరంగా జరగడం విశేషం. మంగళవారం 15,953 లాట్ ల ట్రేడింగ్ వాల్యూమ్ విక్రయాల ద్వారా 10 గ్రాముల బంగారం ధర రూ. 826 రూపాయలు పెరిగి.. 1,35,768 కు చేరుకుంది. సోమవారం వెండి ధర తగ్గింది. మంగళవారం మాత్రం జోరు చూపించింది. మంగళవారం రూ 9,590 పెరుగుదలతో కిలో వెండి రెండు లక్షల 34 వేల పంతొమ్మిది రూపాయలకు చేరుకుంది. మంగళవారం 11,915 లాట్ ల టర్నోవర్ జరిగింది. సోమవారం వెండి ధర రెండు లక్షల 24 వేల 429 రూపాయల వద్ద ముగిసింది.
“గడిచిన సెషన్ లో లాభాల స్వీకరణ అంతంతమాత్రంగానే ఉండడంతో సోమవారం వెండి ధర ఒడిదుడుకులకు గురైంది. విదేశీ మార్కెట్లలో గోల్డ్ ఫ్యూచర్స్ కామిక్స్ లో ఔన్స్ బంగారం 4,380.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 13,635, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 12,500, 18 క్యారెట్ల బంగారానికి 10,208 గా నమోదయ్యాయి.
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారానికి 13,620, 22 క్యారెట్ల బంగారానికి 12,485, 18 క్యారెట్ల బంగారానికి 10,193 ధర పలికింది.
ముంబై నగరంలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 13, 620, 22 క్యారెట్ల బంగారం ధర 12,485, 18 క్యారెట్ల బంగారం ధర 10,193 ధర పలికింది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 13,746, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 12,600, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు 10,505 నమోదయింది
కోల్ కతా లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 13,620, 22 క్యారెట్ల బంగారం 12,485, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు 10,193 గా నమోదయింది.
అహ్మదాబాద్ లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 13,625, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 12,490, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 10,198 గా నమోదయింది.