https://oktelugu.com/

Vivek Ramaswamy : బాధ్యతలు చేపట్టక ముందే బాంబు పేల్చిన వివేక్ రామస్వామి.. ఆందోళనలో వలస ఉద్యోగులు!! 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. 2025, జనవరిలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో తన క్యాబినెట్, వైట్‌ హౌస్‌ కార్యవర్గం ఎంపిక చేసే పనిలో ఉన్నారు. 

Written By: Raj Shekar, Updated On : November 17, 2024 11:38 am
Vivek Ramaswamy

Vivek Ramaswamy

Follow us on

Vivek Ramaswamy :  అగ్రరాజ్యం అమెరికా 47 అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. 2025, జనవరి 20న అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. అధికార మార్పిడికి ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో ట్రంప్‌ అప్పుడే తన క్యాబినెట్, వైట్‌హౌస్‌ నూతన కార్యవర్గం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే విధేయులకు మంత్రి పదవులు, సమర్థులకు వైట్‌హౌస్‌ కార్యవర్గంలో స్థానం కల్పించారు. ఎన్నికల్లో తన గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన ప్రపంచ కుంబేరుడు ఎలాన్‌ మస్క్, రిపబ్లికన్‌ పార్టీ నేత, భారత అమెరికన్‌ వివేక్‌ రామస్వామికి సంయుక్తంగా డిపార్ట్‌మంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీగా నియమించారు. వీరంతా వచ్చే జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు.
బాధ్యలు చేపట్టక ముందే..
కీలక బాధ్యతల నేపథ్యంలో ఎలాన్‌ మస్క్, వివేక్‌ రామస్వామి బాధ్యతలు చేపట్టక ముందే తమ పని మొదలు పెట్టారు. మస్క్‌ ఇటీవల ఇరాన్‌ రాయబారితో రహస్యంగా భేటీ అయ్యారు. అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తానేం తక్కువ కాదన్నట్లు ఇక వివేక్‌ రామస్వామి కూడా మరో బాంబు పేల్చారు. రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని పెద్ద బాంబే పేల్చారు.
కీలక బాధ్యతల్లో ఉన్నామంటూ..
ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్‌ ఎస్టేట్‌ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్‌ రామస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల మంది ఫెడరల్‌ బ్యూరోక్రాట్లను, బ్యూరోక్రసీ నుంచి తొలగించే స్థాయిలో తాను, ఎలాన్‌ మస్క్‌ ఉన్నట్లు ప్రకటించారు.. కాదు కాదు.. భయపెట్టారు. అలా అమెరికారు కాపాడాలనుకుంటున్నామని తెలిపారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి.
అమెరికా ఫస్ట్‌ నినాదంతో..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ అమెరికా ఫస్ట్‌ అనే నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు. వలస వాదులను దేశం నుంచి పంపిస్తామని హెచ్చరించారు. ఇదే ట్రంప్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ట్రంప్‌ పిలుపు మేరకే మస్క్, వివేక్‌ రామస్వామి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఫస్ట్‌ నినాదం మేరకు వలస వాదులను ఉద్యోగాల నుంచి తొలిస్తారన్న భయం అందరినీ వెంటాడుతోంది.