ILP 2025 : ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఈ వేలంలో 574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.. ఇటీవల 10 జట్లు రిటైన్ జాబితాను ప్రకటించిన నేపథ్యంలో.. ఏఏ ఆటగాళ్లను జట్లు కొనుగోలు చేస్తాయనేది ఆసక్తికరంగా మారి. ఈ మెగా వేలంలో ఒక విదేశీ ఆటగాడు మాత్రం అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. అతడి పేరే జోస్ బట్లర్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ ఆటగాడు ఇటీవల కాలంలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికీ అతడు ఫామ్ లోకి వస్తే విధ్వంసానికి పర్యాయపదంగా మారిపోతాడు. దూకుడుకు సిసలైన అర్థం చెబుతాడు. సునామీని కళ్ళ ముందు ఉంచుతాడు.. సాలిడ్ ఓపెనర్ గా బట్లర్ రికార్డులను సృష్టించాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు కెప్టెన్ అవసరం ఉంది. ఇందులో కొన్ని జట్లకు వికెట్ కీపర్ కావాల్సి ఉంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా బట్లర్ అవసరం అన్ని జట్లకూ ఉంది. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో బట్లర్ బంపర్ ఆఫర్ దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
రాజస్థాన్ నుంచి..
బట్లర్ కు రాజస్థాన్ జట్టు మెగా వేలాని కంటే ముందు షాక్ ఇచ్చింది. రిటర్న్ చేసుకోకుండా వదిలేసింది. సంజు కు 18 కోట్లు, యశస్వికి కి కూడా 18 కోట్లు ఇచ్చి టాప్ ప్లేయర్లుగా రాజస్థాన్ తీసుకుంది.. రియాన్ పరాగ్, ధృవ్ జూరెల్ కు చెరో 14 కోట్లు ఇచ్చింది. వెస్టిండీస్ ఆటగాడు హిట్ మేయర్ కు 11 ఇచ్చింది. సందీప్ శర్మకు నాలుగు కోట్లు ఇచ్చి అనామక ఆటగాడిగా తీసుకుంది. ఇక స్పోర్ట్స్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం బట్లర్ ను కొనుగోలు చేయడానికి అన్ని జట్లు ఆసక్తి చూపిస్తున్నాయని తెలుస్తోంది. రాజస్థాన్ జట్టుకు అవకాశం ఉంటే.. బట్లర్ ను కొనుగోలు చేస్తుందని సమాచారం. మొత్తంగా చూస్తే ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో బట్లర్ ఫేవరెట్ ఆటగాళ్లల్లో ముందు వరుసలో ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ” బట్లర్ ఇటీవల కాలంలో ఫామ్ లో లేడు. గత ఐపిఎల్ లో గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదు. కానీ ఈసారి అతడు తన ఫామ్ అందుకుంటాడు. బలంగా ఆడుతాడు. స్థిరంగా నిలబడతాడు. దృఢంగా జట్టుకు అండగా ఉంటాడు. అందువల్లే అతనిపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని నిలుపుకోవడంలో అతడు సఫలీకృతుడవుతాడని” క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బట్లర్ కూడా ఈసారి ఐపీఎల్లో సత్తా చాటడానికి ఎదురుచూస్తున్నాడని ఇంగ్లాండ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాల మీద కథనాలు ప్రసారమవుతున్నాయి.