spot_img
Homeఅంతర్జాతీయంUS UK Relations Fallout 2026: రెండో ప్రపంచ యుద్దం నుంచి ఫ్రెండ్.. ఇప్పుడు అమెరికాకు...

US UK Relations Fallout 2026: రెండో ప్రపంచ యుద్దం నుంచి ఫ్రెండ్.. ఇప్పుడు అమెరికాకు ఇచ్చి పడేసిన మిత్ర దేశం

US UK Relations Fallout 2026: అమెరికాకు వాడుకోవడం మాత్రమే తెలుసు. తన వ్యాపార సంబంధాలు.. ఇతర వ్యవహారాలు కొనసాగినంత వరకే ఆయా దేశాలతో అమెరికా సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ ఉంటుంది. అవసరాలు తీరిన తర్వాత మొహమాటం లేకుండా సంబంధాలను తెంచేసుకుంటుంది.. అందువల్లే అమెరికాను సామ్రాజ్య వాద దేశం అని పిలుస్తుంటారు.. అమెరికా తన స్వార్థం కోసం ఈ ప్రపంచం పై ఎన్నో రకాలుగా యుద్ధాలు చేసింది. ఇతర దేశాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇతర దేశాల అధ్యక్షులను అపహరించి.. తమ దేశానికి తరలించింది. కొందరు దేశాల అధినేతలను చంపేసింది. తన స్వార్థం కోసం ఉగ్రవాదులను పెంచి పోషించిన అమెరికా.. ఆ తర్వాత వారు ఎదురు తిరిగేసరికి చంపేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా దుర్మార్గాలు ఒక పట్టాన ముగియవు.

అమెరికాతో మొదటి నుంచి కూడా బ్రిటన్ దేశానికి దగ్గర సంబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సాగించిన దమనకాండ కు బ్రిటన్ వంత పాడింది. జపాన్ మీద అమెరికా న్యూక్లియర్ బాంబు చేసినప్పుడు.. తెర వెనుక బ్రిటన్ సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధం మాత్రమే కాదు.. అమెరికా సాగించిన అనేక దుర్మార్గాల వెనుక బ్రిటన్ ఉంది. సైనికపరంగా.. ఆయుధాల పరంగా.. బాంబులపరంగా అమెరికాకు బ్రిటన్ అనేక పర్యాయాలు సహాయం చేసింది. అమెరికా కనుసైగ చేస్తే చాలు బ్రిటన్ వెంటనే రంగంలోకి దిగేది. యుద్ధం మొదలుపెట్టేది. తనకు అవసరం ఉన్నా.. లేకపోయినా బ్రిటన్ యుద్ధం సాగిస్తూనే ఉండేది.

ఇరాన్ తో ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తోంది. అమెరికాకు ఇజ్రాయిల్ తోడు కావడంతో మిడిల్ ఆసియాలో పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఇరాన్ కూడా అమెరికాకు.. ఇజ్రాయిల్ కు ఏకకాలంలో సమాధానం చెబుతున్న నేపథ్యంలో.. పరిస్థితి రోజురోజుకు చేయి దాటిపోతుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా హర్ముజ్ జల సంధి లో నౌకల రాకపోకలు సాగడానికి ప్రపంచ దేశాల ముందు కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్ తో గట్టిగా ప్రతిఘటిస్తేనే ప్రపంచ దేశాల నౌకలు రవాణా అయ్యే అవకాశం ఉందని చెప్పింది. దీనికి ఇతర దేశాలు అంగీకరించలేదు. అంతేకాదు అమెరికాకు అత్యంత సన్నిహితమైన బ్రిటన్ నిరసన స్వరం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. అమెరికాతో తమ యుద్ధం చేయలేమని.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యుద్ధం చేయడం అంత మంచిది కాదని స్పష్టం చేసింది. మిడిల్ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో తాము ప్రవేశించబోమని బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ ప్రకటించారు. యుద్ధంతో తమకు సంబంధం లేదని.. దీనివల్ల దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపడానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తామని.. జల సంధిని పున: ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తామని ఆయన వెల్లడించారు. యుద్ధాన్ని ఆపడానికి గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహిస్తామని.. దీనికోసం ప్రపంచ దేశాల అధినేతలను ఆహ్వానిస్తామని స్టార్మర్ ప్రకటించారు.

” ఈ యుద్ధం వల్ల మా దేశ ప్రజలకు కలిగే ప్రయోజనం లేదు. యుద్ధంలో మేం పాల్గొంటే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది ప్రజ ల నుంచి సేకరించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మేము మా దేశ ప్రజలను ఇబ్బంది పెట్టలేము. వారిని బలవంతంగా ఇందులోకి లాగలేము. యుద్ధంతో మాకు సంబంధం లేదు కాబట్టి.. అమెరికాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని” బ్రిటన్ ప్రధానమంత్రి వెల్లడించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular