US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 15 రోజులే గడువు ఉంది. అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో అనేక మంది ఉన్నా.. పోటీ మాత్రం ఇద్దరి మధ్యనే నెలకొంది. సర్వే సంస్థలు కాబోయే అధ్యక్షులు ఎవరు అన్న సర్వే చేస్తున్నాయి. మరోవైపు లిచ్‌మన్ పొలిటికల్ జాతకం తెలిపారు. ఈతరుణంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. తుది విడత ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో పోరు రసవత్తరంగా సాగుతోంది ఈ నేపథ్యంలో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలు అంకెల్లో ఇలా ఉన్నాయి.
ఇద్దరి మధ్యే పోటీ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు పోటీ పడ్డారు. కానీ చివరకు ఎన్నికల బరిలో ఇద్దరు మాత్రమే నిలిచారు. అధికార డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు.
నవంబర్ 5న ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024, నవంబర్ 5న జరుగనున్నాయి. ప్రతీ ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత నిర్వహిస్తారు. అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగిస్తున్నారు.
ఏడు స్వింగ్ స్టేట్స్
అమెరికాలో స్వింగ్ స్టేట్స్ సంఖ్య ఏడు. ఈ రాష్ట్రాల్లో పోరు హోరాహోరీగా జరుగనుంది. అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పేర్కొంటారు. అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాల ఓట్లే అత్యంత కీలకం. ఈ రాష్ట్రాల్లో ఓట్లు తగ్గితే ఓటమి ఖాయం.
435 స్థానాలు ఖాళీ
అమెరికా ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఓటర్లు అధ్యక్షుడితోపాటు కాంగ్రెస్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. సభలో సభ్యుల పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ మెజారిటీలో ఉంది. కమలా హారిస్‌కు చెందిన డెమొక్రాట్లు విజయంపై ధీమాతో ఉన్నారు. ఇక సెనేట్‌లో ఆరేళ్ల పదవీ కాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్పంగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ తిప్పి కొట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.
ఓటర్ల గణాంకాలు
అమెరికాలోని ప్రతీ రాష్ట్రంలో వేర్వేరుగా ఓటర్ల సంఖ్య ఉంది. సభకు ఎంపికయ్యేవారి సంఖ్య జనాభా ప్రాతిపదికన మారుతుంది. గ్రామీణ ప్రాంతమైన వెర్మాంట్‌లో కేవలం మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాలిఫోర్నియాలో 54 ఓట్లు ఉన్నాయి. 50 రాష్ట్రాలు ఉండగా డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో 538 మంది ఓటర్లు ఉన్నారు.
పోల్ వర్కర్ల సంఖ్య
ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పోల్ వర్కర్లు 7,74,000 మంది. మూడు గ్రూపుల ఎన్నికల సిబ్బంది ఉంటారు. వారు ఓటర్లకు సహాయం చేయడం, ఓటింగ్ పరికరాలు ఏర్పాటుచేయడం, ఓటరు ఐడీలను, రిజిస్ట్రేషన్లను ధ్రువీకరించడం వంటివి చేస్తారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక విధులు నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఉంటారు. బ్యాలెట్ లెక్కింపును పర్యవేక్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల పరిశీలకులను నియమిస్తాయి.
244 మిలియన్ ఓటర్లు
ఇక అమెరికాలో 2024లో ఓటు వేసేందుకు అర్హులైన అమెరికన్లు 244 మిలియన్(ఒక మిలియన్ అంటే 10 లక్షలు) అని ద్వైపాక్షిక పాలసీ సెంటర్ తెలిపింది. వీరిలో ఎంత మంది ఓటు వేస్తారో చూడాలి. 2018, 2022లో భారీగా ఓటింగ్ నమోదైంది.