https://oktelugu.com/

Accident in America: అమెరికాలో యాక్సిడెంట్‌.. ఐదుగురు స్పాట్‌ డెడ్‌.. వీరిలో ముగ్గురు తెలుగువారు..!

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు రహదారి నెత్తురొడింది. టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు తెలుగువారు ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 17, 2024 / 03:40 AM IST

    Accident in America

    Follow us on

    Accident in America: అమెరికాలో ఎన్నారైన మరణాలు రెండు నెలలుగా కాస్త తగ్గుముఖం పట్టాయి. కారణం ఏదైనా ప్రతీ నెల కనీసం ఐదురుగు భారతీయులు అమెరికాలో మరణించేవారు. ఇటీవలే కాస్త తగ్గాయని ఎన్నారైల కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్త అందింది. టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు తెలుగురవారు ఉన్నారు. రాండాల్ఫ్‌ సమీపంలో స్టేట్‌ హైవేపై సోమవారం సాయంత్రం 6:45 గంటలకు రెండు వామనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.

    ముగ్గురు చిత్తూరు జిల్లా వాసులు..
    రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదురుగు భారతీయుల్లో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో ఒకరు తిరుపతి జిల్లా గూడురుకు చెందిన తిరుమూరు గోపిగా, ఇద్దరు శ్రీకాలహస్తికి చెందిన రాజినేని శివ, హరిత ఉన్నారు. ఈ ప్రమాదంలో హరిత భర్త చెన్ను సాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషయమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యాక్సిడెంట్‌కు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవలే టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. తాజాగా ఐదుగురు మరణించారు.