US Navy In India: అమెరికా సైనికులు( American soldiers) విశాఖలో హల్చల్ చేశారు. పెద్ద ఎత్తున నగరానికి చేరుకున్నారు. భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 కోసం అమెరికా యుద్ధనౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఎందుకు సంబంధించి విన్యాసాలు ఈనెల 7 వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో నౌకాదళ కం స్టాక్, రాల్ఫ్ జాన్సన్ ప్రత్యేకతల గురించి అధికారులు వివరించారు. యుద్ధ సమయంలో, విపత్తుల సమయంలో నౌకలు ఎలా సహాయ కార్యక్రమాలు చేస్తాయో అవగాహన కల్పించారు. ఇండో పసిఫిక్ ప్రాంత భద్రతకు దిక్సూచిగా భారత్ అమెరికా సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు విశాఖపట్నం వచ్చాయి. ఈనెల 7 వరకు ఈ విన్యాసాలు విశాఖలో జరుగుతాయి.
Also Read: గోదావరి జిల్లాల రొయ్యకు ట్రంప్ దెబ్బ!
* పరిశీలించిన అధికారులు..
విశాఖ( Visakhapatnam) చేరుకున్న అమెరికాకు చెందిన యుద్ధ నౌకలను మన దేశానికి చెందిన అధికారులు పరిశీలించారు. యుఎస్ఎస్ కం స్టాక్, యు ఎస్ ఎస్ రాల్ఫ్ జాన్సన్ 144 షిప్ లను అధికారులు సందర్శించారు. కమాండర్లు బైరాన్ స్టాక్స్, జాక్ సీజర్ ఈ షిప్ ల గురించి వివరించారు. ఈ నౌకలు ఎలా పనిచేస్తాయి? గతంలో వాటి సేవలు ఎలా ఉపయోగపడ్డాయి అనే విషయాలను తెలియజేశారు. ప్రధానంగా నావిగేషన్, రాడార్ వ్యవస్థ, కెప్టెన్ ఛాంబర్, క్యాంటీన్ వసతి, యుద్ధ విభాగాల గురించి వివరించారు.
* పలు అంశాలపై చర్చ..
ఇరుదేశాల ప్రతినిధులు ఈఎన్సిలో( ENC )పలు అంశాలపై చర్చించారు. కం స్టాక్ నౌక యుద్ధ సమయంలో మాత్రమే కాదు.. విపత్తుల సమయంలో కూడా సాయంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ షిప్ లో పెద్ద హోవర్ క్రాఫ్ట్ లు, యుద్ధ ట్యాంకులు, యుద్ధ హెలిక్యాప్టర్లు సైతం అందుబాటులో ఉంటాయి. ఈ షిప్ లను ఎలా ఉపయోగించుకుంటారో కూడా వివరించే ప్రయత్నం చేశారు అక్కడ అధికారులు. అత్యాధునిక ఆయుధాలతో శత్రువులను ఎలా ఎదుర్కోవాలో నమూనాలను ప్రదర్శించి చూపించారు. సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే లాంచర్ల గురించి చక్కగా వివరించారు.
* విధ్వంసకర యుద్ధ నౌక
రాల్ఫ్ జాన్సన్ 144 షిప్( Ralph Johnson 144 ship ) కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సాధించింది. దీనిని విధ్వంసకర యుద్ధనౌకగా సైనికులు పిలుస్తారు. నీరు, గాలి, భూమిలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు ఈ నౌకలో ఉన్నాయి. ఇదే దీని ప్రత్యేకత అని అమెరికా సైన్యానికి చెందిన కమాండర్లు తెలిపారు. అమెరికా సైనికుల రాకతో విశాఖ తీర ప్రాంతం సందడి వాతావరణం కనిపిస్తోంది.