Trump repeats Ind-Pak ceasefire: కశ్మీర్‌లోపి పహల్గాంలో పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘనలో 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. దీనిని సహించని పాకిస్తాన్.. భారత్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో భారత్ కూడా పాకిస్తాన్‌పై దాడి చేసింది. 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం ఛేసింది. ఈ క్రమంలో ఐదు రోజుల యుద్ధం అర్ధంతరంగా ఆగింది.
మే 10న రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య సంప్రదింపుల ద్వారా ఆగస్టు ఒప్పందం కుదిరింది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే యుద్ధం తానే ఆపానని ప్రకటించారు. దీనిపై భారత్‌లో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తర్వాత ట్రంప్ తాను ఆపలేదని వెల్లడించారు. తాజాగా మళ్లీ నాలుక మడతపెట్టారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నిరోధించినట్లు, అది అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందని వాదించారు. ఈ సంఘర్షణలో ఐదు విమానాలు కూల్చివేయబడ్డాయని, తాను రెండు దేశాల నాయకులతో మాట్లాడి, వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించడంతో యుద్ధాన్ని ఆపినట్లు పేర్కొన్నారు.
ట్రంప్ నవ్వులపాలు..
ట్రంప్ తన జోక్యం వల్ల యుద్ధం ఆగిందని, లేకపోతే అది అణు యుద్ధంగా మారేదని పేర్కొన్నారు. ఆయన రెండు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి రణధీర్ జైస్వాల్, అమెరికాతో చర్చల్లో వాణిజ్యం గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. ఆగస్టు ఒప్పందం భారత్, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ఫలితమని భారత్ నొక్కి చెప్పింది. ఇక ట్రంప్ ఒకసారి తానే ఆపానని, మరోసారి తాను ఆలపేదని, మళ్లీ తానే ఆపానని ప్రకటించడం ద్వారా నవ్వులపాలవుతున్నారు. ఇక ఐదు విమానాలు కూల్చివేయబడినట్లు చేసిన ప్రకటనకు ట్రంప్ ఎలాంటి ఆధారాలు చూపలేదు. భారత వైమానిక దళ జనరల్ చౌహాన్, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ విమానాలు కొన్ని నష్టపోయినట్లు సూచనప్రాయంగా పేర్కొన్నప్పటికీ, ఐదు విమానాలు కూలిపోయినట్లు కచ్చితమైన సమాచారం లేదు.
Also Read: చరిత్రలో అతిక్రూరుడైన చంఘీజ్ ఖాన్ కు పర్యావరణ రక్షకుడిగా ఎందుకు గుర్తింపు?
ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం
భారత్ ఎల్లప్పుడూ కాశ్మీర్ విషయంలో మూడవ పక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం, భారత్–పాకిస్తాన్ సమస్యలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించాలని భారత్ భావిస్తుంది. ట్రంప్ వాదనలు ఈ సూత్రాన్ని ఉల్లంఘించినట్లు భావించబడుతోంది, ఇది భారత్–అమెరికా సంబంధాలపై ఒత్తిడిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ట్రంప్ జోక్యాన్ని స్వాగతించింది, అంతేకాక ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని ప్రతిపాదించింది. ఇది భారత్‌లో మరింత వివాదాన్ని రేకెత్తించింది.
విపక్షాల అభ్యంతరం..
భారత్‌లోని విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, ట్రంప్ వాదనలను ప్రభుత్వంపై విమర్శలకు ఉపయోగించాయి. కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ట్రంప్ ఈ వాదనను 22 సార్లు పునరావృతం చేశారని, ఇది భారత ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని సూచిస్తుందని విమర్శించారు.
ట్రంప్ జోక్యం ఎందుకు?
ట్రంప్ స్వీయ–ప్రచారం, ఆర్థిక ఒత్తిడి వంటి సాధనాలను ఉపయోగించడం. ఆయన ఈ వాదనల ద్వారా అంతర్జాతీయ వేదికపై తన ప్రభావాన్ని, శాంతి స్థాపకుడిగా తన చిత్రణను బలోపేతం చేయడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. అయితే, ఈ వాదనలు కాశ్మీర్ విషయంలో మూడవ పక్ష జోక్యంగా విపక్షాలు భావిస్తున్నారు. ట్రంప్ వాదనలు ఆయన వ్యక్తిగత రాజకీయ లక్ష్యాలు, ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి వంటి ఆకాంక్షలను సాధించేందుకు ఉద్దేశించినవిగా భావిస్తున్నారు.