US China Trade War: ట్రంప్ టారిఫ్ వారు(Tariff War) ముదురుతోంది. ప్రధానంగా రెండు సంపన్న దేశాలు అయిన అమెరికా(America), చైనా(China) మధ్య వాణిజ్య యుద్ధంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు చైనా కూడా దీటుగా సంకాలు విధించింది. మళ్లీ 54 శాతం సుంకాలని ట్రంప్ చైనాను బెదిరించాడు. కానీ, చైనా బెదిరింపులకు భయపడే అవకాశం కనిపించడం లేదు.
Also Read: ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. యాపిల్ స్టోర్ల వద్ద బారులు.. ఎందుకంటే..
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) అధిపతి ఎలాన్ మస్క్(Elon Musk), చైనాపై విధించిన సుంకాలను పునరాలోచించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ చర్చలు ఫలించలేదని, ట్రంప్ తన నిర్ణయంలో మొండిగా ఉన్నారని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మస్క్ బహిరంగంగా టారిఫ్‌లపై వ్యాఖ్యానించకపోయినా, ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్ వాణిజ్య సహకార ప్రయోజనాల గురించి చెప్పిన వీడియోను ఎక్స్‌లో పంచుకోవడం ద్వారా, సుంకాలు ప్రపంచ వాణిజ్యానికి హానికరమనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు.
పరస్పర సుంకాలతో ఉద్రిక్తతలు
అమెరికా చైనా దిగుమతులపై 34% సుంకం విధించగా, చైనా ప్రతీకార చర్యగా అమెరికాకు చెందిన 16 సంస్థలకు రెండు–విధాల వస్తువుల ఎగుమతిపై నిషేధం విధించింది. అంతేకాదు, రక్షణ(Defance), కంప్యూటర్(Computer), స్మార్ట్‌ఫోన్(Smart Phone) పరిశ్రమలను దెబ్బతీసేలా అరుదైన ఖనిజాల ఎగుమతులను నియంత్రించింది. చైనా తన ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో వ్యాజ్యం కూడా దాఖలు చేసింది. ఈ చర్యలను ట్రంప్ తీవ్రంగా ఖండిస్తూ, ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఏప్రిల్ 9 నుంచి 50% అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభం ఆందోళన
ఈ వాణిజ్య యుద్ధం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా నిషేధాలు అమెరికా టెక్, రక్షణ రంగాలను దెబ్బతీస్తాయి, అదే సమయంలో అమెరికా సుంకాలు వినియోగదారుల ధరలను పెంచుతాయి. ఈ పరస్పర చర్యలు రెండు దేశాల ఆర్థిక వద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ తాజా హెచ్చరికలతో చర్చలు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి, ఇది వాణిజ్య సంబంధాలను మరింత దిగజార్చవచ్చు.
అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం పరస్పర సుంకాలతో ముదిరిపోతుండగా, ఎలాన్ మస్క్ సుంకాలను తగ్గించాలన్న సూచనలు ట్రంప్‌ను ఒప్పించలేకపోయాయి. చైనా ప్రతీకార చర్యలు, అమెరికా హెచ్చరికలు గ్లోబల్ ఆర్థిక అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది. ఈ సంక్షోభం తీవ్రతరం కాకముందే రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ.. యాపిల్ స్టోర్ల వద్ద బారులు.. ఎందుకంటే..