https://oktelugu.com/

Modi Russia Visit: రష్యాలో మోదీకి ఊహించని సర్ ప్రైజ్ లు.. జన్మలో మరిచిపోలేని ఆతిథ్యమబ్బా..!

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. కజాన్‌లో దిగిన మోదీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. బుధవారం బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్న మోదీకోసం వెరైటీ రుచుల వంటకాలు సిద్ధం చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 / 02:00 AM IST

    Modi Russia Visit(1)

    Follow us on

    Modi Russia Visit: బ్రిక్స్‌ 16వ శిఖరాగ్ర సదస్సు రెండు రోజులపాటు రష్యాలోని కజాన్‌లో జరుగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో రష్యా బయల్దేరి వెళ్లారు. సాయంత్రం కజాన్‌ చేరుకున్నారు. అక్కడ రష్యా అధికారులు మోదీ బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపి శాంతియుత పరిష్కారం చూడాలని మోదీ సూచించారు. ఇందుకు భారత్‌ సహకారం అందిస్తుందని వెల్లడించారు. బుధవారం(అక్టోబర్‌ 23న) మోదీ బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో మోదీ రష్యా అధినేత పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. సమావేశాలను విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఇక బ్రిక్స్‌ సదస్సు కోసం వెళ్లిన మోదీకి అక్కడి ఛాక్‌–ఛక్‌ లడ్డూలు, కొరోవాయ్‌ కేకులు స్వాగతం పలికాయి. కొత్తరకం పేర్ల వంటకాలను చూసి నెటిజన్లు ఆన్‌లైన్‌లో వాటిగురించి ఆరా తీస్తున్నారు. మోదీకి రష్యాలోని మైనారిటీలు అయిన టాటర్‌ మహిళలు తమ సంప్రదాయ వేషధారణ, వంటకాలతో స్వాగతం పలికారు. ఇందులో ఛాక్‌–ఛక్‌ లడ్డూ, కొరొవాయ్‌ కేక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కజాన్‌ నగరం ఉన్న టాటర్, బష్కిర్‌ ప్రాంతాల ఆహార, ఆతిథ్య సంప్రదాయాలు ఇందులో మిళితమై ఉన్నాయి.

    ఛాక్‌–ఛక్‌ లడ్డూ ప్రత్యేకత..
    చాక్‌–చక్‌ లడ్డూను ప్రధానంగా గోధుమ పిండితో తయారు చేస్తారు. చపాలీలు చేసి పెనంపై కాల్చకుండా సన్నగా నిలువుగా, అడ్డంగా చిన్నచిన్న చతుస్త్రాకారపు గడుల్లా కల్తిరిస్తారు. తర్వాత వాటిని నూనెలో బంగారం రంగు వచ్చే వరకూ వేయిస్తారు. తర్వాత బెల్లం లేదా చక్కెర పాకంలో వేసి గట్టిపడగానే లడ్డూలాగా గుండ్రంగా చేస్తారు. వీటిచే ఛాక్‌–చక్‌ లడ్డూలు అంటారు. వీటిని చూడగానే మోదీ ఆశ్చర్యపోయారు. ఇది భారత్‌లో తయారు చేసే వంటకంలా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. బిహార్‌ వంటకం ముర్జీ కలాయ్, పశ్చిమ బెంగాల్‌ వంకం మురీర్‌ మోవా, ఒడిశా వంటకం మువాలా ఉందని సరదాగా తెలిపారు. ఛాక్‌–ఛక్‌ లడ్డూ మూలాలు టాటరై్టన్, బష్కర్‌ స్టోన్లలో ఉన్నాయని స్థానికులు తెలిపారు.

    కొరోవాయ్‌ కేక్‌ ప్రత్యేకత..
    ఇక మోదీ రుచి చూసిన మరో స్వీట్‌ కేక్‌.. దీనిపేరు కొరోవాయ్‌. బేకరీ వంటకమైనా ఈ కొరొవాయ్‌ కేకు అక్కడి ప్రతీ పెళ్లి వేడుకలో తప్పకుండా ఉంటుంది. అతిథులకు వడ్డించడం కోసమే ప్రత్యేకంగా దీనిని సిద్ధం చేస్తారు. తూర్పు స్లావిక్‌ ప్రాంత వాసులు ఈ బ్రెడ్‌ కేక్‌ను తయారు చేసేవారు. అప్పటి నుంచి ప్రంపదాయంగా వస్తోంది. స్లావ్‌ ప్రాంత ప్రజలు సూర్యుడిని పూజించే వారు. వృత్తాకార సూర్యుడికి గుర్తుగా ఈ కేక్‌ను గుండ్రంగా తయారు చేస్తారు.