New World Record: సుదూర లక్ష్యాలను చేదించాలంటే ఏ దేశ సైన్యమైన సరే మిసైల్స్ ఉపయోగిస్తుంది. శత్రు దేశాల సైనికులను లేదా ఉగ్రవాదులను లేదా తీవ్రవాదులను అంతం చేయాలంటే బాంబులు ప్రయోగిస్తుంది. అనివార్య పరిస్థితుల్లోనే తుపాకులకు పని చెబుతుంది.. సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైనికులు తుపాకులతో కాల్పులు జరుపుతారు. గతంలో యుద్ధాలు జరిగినప్పుడు.. వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు కాల్పులు జరిగేవి. అయితే ఆధునిక కాలంలో యుద్ధాలు వేరే విధంగా జరుగుతున్నాయి. మరీముఖ్యంగా ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆయుధాల వాడకం.. తుపాకీల వినియోగంలో సరికొత్త సాంకేతికత వెలుగులోకి వస్తోంది.
కొన్ని సంవత్సరాలుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం వల్ల అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికి రెండు దేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా కాల్పుల్లో, పరస్పరం దాడులు చేసుకోవడంలో సరికొత్త విధానాలకు పాల్పడుతున్నాయి. ఇక ఇటీవల ఉక్రెయిన్ రష్యాలో స్పై ఆపరేషన్ చేపట్టింది. భారీగా నష్టాన్ని కలిగించింది. దాన్ని మర్చిపోకముందే మరో అధునాతన తుపాకులతో, కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి సరికొత్త రికార్డు సృష్టించింది.
Also Read: పుతిన్ కు ఏమైంది? ట్రంప్ ని కలిసింది డూప్లికేటా?
ఉక్రెయిన్ ఉపయోగించిన యూనిట్ ఘోస్ట్ ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది. 13 అడుగుల దూరం (దాదాపు నాలుగు కిలోమీటర్లు) లో రష్యా సైనికులను ఎలిగేటర్ 14.5 ఎంఎం రైఫిల్ తో కాల్చి చంపింది. ఇక్కడికి దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు సైనికులను ఒకే షాట్ తో మట్టు పెట్టింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ మిలిటరీ విభాగం వెల్లడించింది. కృత్రిమ మేధ, డ్రోన్ గైడెన్స్ ద్వారా ఈ సాధ్యమైందని ఉక్రెయిన్ చెబుతోంది. అంతేకాదు ఉక్రెయిన్ లోనే ఈ రైఫిల్ తయారు చేశారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.