Director Sukumar Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసిన ఆర్య సినిమా నుంచి పుష్ప 2 సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది…కొన్ని సినిమాలతో ఆయన ప్లాపులను మూట గట్టుకున్నప్పటికి ఆ సినిమాలన్నీ కూడా అతనికి మంచి ఇమేజ్ ను అయితే సంపాదించి పెట్టాయి. ముఖ్యంగా ‘ వన్ నేనొక్కడినే’ సినిమాలో ఆయన ప్రేక్షకుల యొక్క ఐక్యూ లెవల్ ను టెస్ట్ చేయడానికి చాలా పజిల్స్ ని వదులుతూ ఇన్ డెప్త్ గా ఆ సినిమాని చిత్రీకరించాడు. అయినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన చాలా వరకు నిరాశ చెందినట్టుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఆ తర్వాత ఆయన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కూడా ప్రేక్షకుడి యొక్క ఐక్యూ ను టెస్ట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమా కూడా సక్సెస్ అయితే సాధించింది కానీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని నమోదు చేయలేక పోయింది. దాంతో ఆయన రూటు మార్చి మాస్ కమర్షియల్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… రంగస్థలం, పుష్ప సినిమాలతో ఇండస్ట్రీలో పెను రికార్డులను క్రియేట్ చేశాడు.
ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నిజానికి ఆయన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించే కెపాసిటి ఉన్నప్పటికి ఆయన సినిమాలో ప్రేక్షకుడి యొక్క తెలివిని టెస్ట్ చేయడానికి ఆయన చాలా రకాల సీన్లలో డిటెలైయింగ్ ను ఇస్తు వచ్చాడు దాంతో ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పి కొడుతూ ఉంటారు.
Also Read: యాక్టింగ్ లో జగపతి బాబు ను టచ్ చేయలేకపోయిన బాలీవుడ్ స్టార్ హీరో…
అందుకే అతను ఆయన సినిమాల్లో ఎక్కువగా తెలివిని వాడకుండా కమర్షియల్ పంథా లోనే సినిమాలను కథలను రాస్తూ సినిమాలను చేయడమే ఉత్తమం అని డిసైడ్ అయిపోయి కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం అతనికి వరుసగా సక్సెస్ లు అయితే దక్కుతున్నాయి. పాన్ ఇండియాలో సుకుమార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
పాన్ ఇండియాలో చేసిన పుష్ప 2 సినిమా బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా సుకుమార్ కి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది…ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…