Homeఅంతర్జాతీయంPutin Trump Meeting: పుతిన్ కు ఏమైంది? ట్రంప్ ని కలిసింది డూప్లికేటా?

Putin Trump Meeting: పుతిన్ కు ఏమైంది? ట్రంప్ ని కలిసింది డూప్లికేటా?

Putin Trump Meeting: దాదాపు ఆరడుగుల ఎత్తు.. ఎరుపు రంగు.. పటిష్టంగా ఉండే శరీరం.. స్థిరంగా ఉండే అడుగులు.. సూటిగా ఉండే చోటు.. స్పష్టంగా మాట్లాడే తీరు.. ఇవన్నీ కూడా పుతిన్ సొంతం. ఎన్ని ఆరోపణలు ఉన్నా సరే.. రష్యా దేశాన్ని ఆయన సుదీర్ఘకాలం పాలిస్తున్నారు. యూరప్ దేశాలను.. అమెరికా లాంటి దేశాన్ని ఆయన లెక్కపెట్టకుండా ముందుకు పోతున్నారు. మూడు సంవత్సరాలకు మించిన కాలం నుంచి ఉక్రెయిన్ తో రణం సాగిస్తూ.. ప్రపంచం మీద తన పట్టును నిరూపించుకుంటున్నారు.

Also Read: మన దేశ ప్రెసిడెంట్ వర్షంలో.. అదే అమెరికాలో వాళ్ళ ప్రెసిడెంట్ ని వర్షంలో తడవనిస్తారా?

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని నిలిపివేయడానికి ఇటీవల అలస్కా లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. సాధారణంగా రెండు అగ్రరాజ్యాల అధిపతులు భేటీ అయితే ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. వీరిద్దరి భేటీని కూడా ప్రపంచ దేశాలు ఆసక్తిగానే చూసాయి.. అయితే గ్లోబల్ మీడియా వీరిద్దరి భేటీ మీద ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది.. ఎందుకంటే అలస్కాలో ట్రంప్ తో భేటీ అయింది పుతిన్ కాదని.. అతడి బాడీ డబుల్ అని సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. చెవుల వెంట్రుకలు ఉన్నాయని.. చర్మం ముడతలుగా కాకుండా కాంతివంతంగా కనిపిస్తోందని.. నిటారుగా నడవకుండా.. కాస్త వంగి వెళ్తున్నారని.. అసలు పుతిన్ ఇలా ఉండాలని గ్లోబల్ మీడియా తన కథనంలో పేర్కొంది. గ్లోబల్ మీడియా తన ప్రసారం చేసిన కథనానికి బలమైన ఆధారాలు కూడా చూపించింది.

అందువల్లేనా

సినిమాల్లో హీరోలు డూప్ ల సహాయంతో కొన్ని సన్నివేశాలలో నటిస్తుంటారు. రాజకీయ నాయకులకు కూడా డూప్ లు ఉంటారని… పుతిన్ నిరూపించారు. వాస్తవానికి పుట్టిన కొంతకాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కాళ్లు సరిగా పనిచేయడం లేదని.. చేతులు కూడా సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని.. అధికారిక కార్యక్రమాలను, సమీక్షలను నిర్వహించలేక పోతున్నారని సమాచారం. కొన్ని సందర్భాలలో ఆయన శరీరం కూడా వణికి పోతున్నదని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం..

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ లో పర్యటించారు. మారియా పోల్ నగరంలో కలియతిరి గారు. యుద్ధం మొదలైన సందర్భంగా మరియాపోల్ ఉక్రెయిన్ లో ఉండేది. తర్వాత దానిని రష్యా స్వాధీనం చేసుకుంది. ఇది ఈ రెండు దేశాలకు సరిహద్దులో ఉంటుంది. అయితే నాడు ఆ నగరంలో పర్యటించినప్పుడు పుతిన్ స్వయంగా కారు నడిపారు. రష్యా చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. అయితే దీనిని రష్యా మీడియా గొప్పగా పేర్కొనగా.. ఇతర గ్లోబల్ మీడియా రంధ్ర అన్వేషణ చేసింది. పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కారు ఎలా డ్రైవ్ చేస్తారని వాదించింది. కారు నడిపింది పుతిన్ కాదని.. అతని మాదిరిగా ఉన్న బాడీ డబుల్ అని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. ఇప్పుడు అదే అంశాన్ని గ్లోబల్ మీడియా ప్రస్తావిస్తోంది. పుతిన్ ఆరోగ్యం బాగోలేదని.. అందువల్లే ట్రంప్ తో భేటీకి బాడీ డబుల్ ను పంపించారని గ్లోబల్ మీడియా ఆరోపిస్తోంది. మరి దీనిపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular