Ukraine Russia War
Ukraine Russia War: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump)భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనవరి 20న అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చి హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, కానిస్టిట్యూషనల్ ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. మరోవైపు యుద్ధాలు ఆపేందుకు ఇటు రష్యా, ఉక్రెయిన్, అటు ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్(Ijrayol), హమాస్(Hamas) మధ్య 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం చేయించారు. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్(Russha-Ucrain) యుద్ధం పూర్తిగా ఆపే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. వాషింగ్టన్ నుంచి వెలువడిన వార్తల ప్రకారం, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సుమారు రెండు గంటల ఫోన్ సంభాషణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్(White House) తెలిపింది. ఈ సందర్భంగా ఇరు నేతలు శాశ్వత శాంతి స్థాపనతో యుద్ధానికి ముగింపు పలకాలని సంకల్పించారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడాలని, ద్వైపాక్షిక సహకారం అవసరమని వారు ఒకరికొకరు వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా యుద్ధం..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం రెండు దేశాలకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. అనేక ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీ నిధులు ఖర్చయ్యాయి. ఈ నిధులను ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యేదని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా సామరస్యపూర్వక పరిష్కారాలతో ఈ యుద్ధాన్ని ఇప్పుడే ముగించాలని పేర్కొంది. యుద్ధ విరమణకు తీసుకోవాల్సిన చర్యలపై ట్రంప్(Trump), పుతిన్(Puthin) చర్చించారు. ముఖ్యంగా ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలపై దాడులను ఆపడం, నల్ల సముద్రంలో కాల్పులను నియంత్రించడం వంటి అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ట్రంప్ సూచించారు.
ఇజ్రాయెల్ అంశం కూడా..
ట్రంప్–పుతిన్ సంభాషణల్లో ఇజ్రాయెల్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్‌ను నాశనం చేసే స్థితిలో ఉండకూడదని ఇరు నేతలు అంగీకరించారు. అలాగే, వ్యూహాత్మక ఆయుధాల విస్తరణను నియంత్రించాలని చర్చించారు.
పుతిన్ షరతు..
అయితే, ఈ శాంతి ప్రక్రియకు పుతిన్ ఒక షరతు విధించారు. ఉక్రెయిన్‌కు విదేశీ సైనిక సాయం, నిఘా సమాచారం అందించడాన్ని పూర్తిగా నిలిపివేయాలని క్రెమ్లిన్ పేర్కొంది. ఈ షరతు ద్వారా వివాదం మరింత తీవ్రతరం కాకుండా రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించింది. ట్రంప్ ఈ శాంతి కృషిని స్వాగతించినట్లు క్రెమ్లిన్ అభినందించింది. ఈ చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఒక అడుగుగా భావిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ukraine russia war trump success peace deal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com