Russia -Ukraine War : రెండేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడడం లేదు. సుదీర్ఘ యుద్ధంతో రెండు దేశాలు విసిగిపోయాయి. ఉక్రెయిన్‌ను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉక్రెయిన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాపై ఎదురు దాడి చేస్తోంది. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. డ్రోన్ల సహాయంతో ఉక్రెయిన్ రష్యాపై ఎదురు దాడి చేస్తోంది. దీంతో రష్యా కూడా వాటిని కూల్చివేస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో 2001లో నవంబర్ 9 తరహా దాడికి యత్నించింది ఉక్రెయిన్ రెండు డ్రోన్లతో రష్యాలోని సరాటోవ్‌లో ఉన్న ఎత్తయిన భవనంపైకి ప్రయోగించింది. ఈ డ్రోన్ నేరుగా వచ్చి ఎత్తయిన భవనాన్ని ఢీకొట్టడంతో భవనం పాక్షికంగా దెబ్బతిన్నది. ఇది ఉక్రెయిన్ పనే అయి ఉంటుందని రష్యా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మాస్కో వైపు వెళ్తున్న మూడు డ్రోన్‌లను మాస్కో ప్రాంతంలోని పోడోల్సక్ నగరంపై కూలిపోయాయని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో తెలిపారు.
నష్టం జరుగలేదన్న రష్యా..
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ రష్యాపై భారీగా డ్రోన్ దాడిని ప్రారంభించింది, మాస్కో, బ్రయాన్సక్, తులా సమీపంలో డ్రోన్‌లను అడ్డగించే వాయు రక్షణతో కూలిన డ్రోన్‌ల వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా నష్టం జరగలేదని రష్యా అధికారులు నివేదించారు. అదనంగా, రోస్టోవ్ ప్రాంతంపై క్షిపణి ధ్వంసమైందని తెలిపారు. ఉక్రెయిన్ ఇటీవల అటువంటి దాడులను తీవ్రతరం చేసింది. దాని భూభాగంపై రష్యా దాడులకు ప్రతిస్పందనగా కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్ ప్రయోగించిన మొత్తం డ్రోన్లు, క్షిపణుల సంఖ్య అస్పష్టంగానే ఉంది. క్రెమ్లిన్‌కు దక్షిణంగా 38 కిమీ (24 మైళ్ళు), సరిహద్దు బ్రయాన క్ ప్రాంతంలో 15 డ్రోన్‌లను ధ్వంసం చేశాయని రష్యా అధికారులు తెలిపారు.
నాడు అమెరికా ట్విన్ టవర్స్‌పై..
ఇదిలా ఉంటే.. 2001, సెప్టెంబర్ 11న అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల ముఖ్యమైన ప్రభుత్వ, వాణిజ్య స్థానాలపై నాలుగు దాడులు చేసింది. ఈ దాడులు అమెరికా చరిత్రలో అతిపెద్ద దాడులు. ఇందులో దాదాపు మూడువేలకు పైగా ప్రజలు మరణించారు. న్యూయార్క్‌లో 2,750 మంది, పెంటగాన్‌లో 184 మంది పెన్సిల్వేనియాలో 40 మంది ప్రయాణికులు మరణించారు. మొత్తం 19 మంది ఉగ్రవాదులు మరణించారు. 400 మందికి పైగా పోలీసు అధికారులు మరియు అగ్నిమాపక సిబ్బంది మరణించారు.
In Saratov and Engels in Russia, two building were hit by (Ukrainian) drones. Four loud explosions were also reportedly heard by residents. pic.twitter.com/oolF3LjjbP
— raging545 (@raging545) August 26, 2024