UK weather: యునైటెడ్ కింగ్‌డమ్ గజగజ వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పడిపోతుండడంతో ప్రయాణాలకు ఆటకం కలుగుతోంది. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో పాఠశాలలను మూసివేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా అక్కడి కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 13 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదయ్యాయి. మరోవైపు ఉత్తర స్కాట్‌లాండ్, ఓర్కీ ్న, షెట్లాండ్ దీవులకు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా దీవుల్లో పాఠశాలలను అధికారుల ఉమూసివేశారు. ఇక స్కాట్‌లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో పసుపు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మూతపడుతున్న పాఠశాలలు..
యూకేలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో పాఠశాలలను మూసివేస్తున్నారు. చలి కారణంగా వివిధ ప్రాంతాలకు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మంచు తుపాన్ల కారణంగా ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు తుపాను హెచ్చరికలు ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు. ఇక హైలాండ్స్‌లోని తుల్లోచ్ వంతెన వద్ద గురువారం అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ 13.6 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు మైనస్ 14 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది.
మరింత పడిపోయే ఛాన్స్..
ఇదిలా ఉండగా ఉత్తర స్కాట్లాండ్, ఓర్కి ్న, షెట్లాండ్ దీవుల్లో మంచు తుపాన్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడి కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సీయస్‌కు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల అధికారులు ప్రయాణాలు పూర్తిగా నిలిపివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అబెర్‌డీన్‌షైర్‌లోని దాదాపు 130 పాఠశాలలు కూడా మూసివేశారు. ఇక కాలుష్యంతో కూడిన మంచు తుపాను ఉత్తర ఐర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.