UK: విదేశీ విద్యపై భారత్‌తోపాటు చాలా దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. దీంతో స్వదేశంలో కన్నా విదేశాల్లో ఉన్నత చదువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌తోపాటు అనేక దేశాల విద్యార్థులు అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అక్కడి యూనివర్సిటీల్లోనే గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఇక భారతీయులు ఎక్కువగా అమెరికాకు వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విదేశీ వలసలను తగ్గించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు ప్రత్యామ్నాయంగా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ట్రిటన్ అదును చూసి షాక్ ఇచ్చింది. తమ దేశాలకు వచ్చే విద్యార్థులు మెయింటనెన్స్ నిధులను మరింత ఎక్కువగా చూపించాలని అంటోంది. ప్రస్తుతం మెయింటనెన్స్ మనీ మొత్తాన్ని 11.17 శాతం పెంచింది. ఇది 2025, జనవరి నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం విద్యార్థి వీసా దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలో 14.4 లక్షలు(13.347 పౌండ్లు) చూపించాల్సి ఉంటుంది. 28 రోజులపాటు వారి బ్యాంకు ఖాతాలో ఈ నగదు ఉండాలి. గతంలో ఈ మొత్తం రూ.12.9 లక్షలు(12.006 పౌండ్లు)గా ఉంది. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యవయాన్ని దృష్టిలో పెట్టుకుని మెయింటనెన్స్ మనీ పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది.
లండన్ వెలుపల కూఆ..
ఇక లండన్ వెలుపల చదవాలనుకునే విద్యార్థుల మెయింటనెన్స్ మనీ కూడా పెంచింది. దీనిని 11.05 శాతం పెంచింది. లండన్ వెలుప యూనివర్సిటీల్లో చదదివే విద్యార్థులకు ఇప్పటి వరకు 9,207 పౌండ్లు ఉండా, దానిని 10.224 పౌండ్లకు పెంచింది. 2025 జనవరి నుంచి ఇది కూడా అమలులోకి వస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో లండన్‌లో, లండన్ వెలుపల చదవాలనుకునేవారు మరింత సమకూర్చుకోవల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా, ప్లాన్ చేసుకోవాలి. భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్‌షిప్‌లు సంపాదించాలని సూచిస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే సెలిట్ అయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్లే అని కెరీర్ మొయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ తెలిపారు.