spot_img
Homeఅంతర్జాతీయంBritain refugee crisis: బ్రిటన్‌ కొంప ముంచుతున్న శరణార్థులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..!

Britain refugee crisis: బ్రిటన్‌ కొంప ముంచుతున్న శరణార్థులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..!

Britain refugee crisis: బ్రిటన్‌.. ఒకప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. అనేక దేశాలను దశాబ్దాలు పాలించింది. బతుకుదెరువుకు వెళ్లి.. అక్కడే పాలకులుగా మారింది. భారత్‌కు కూడా వచ్చిన బ్రటిషర్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించారు. అయితే మారుతున్న పరిణామాలతో ఇప్పుడు బ్రిటన్‌ వలసలతో బాధపడుతోంది. శరణార్ధులుగా వచ్చిన వారు అక్కడే స్థిరపడి బ్రిటిషర్లు స్థానికత కోల్పోయేలా చేస్తున్నారు. అడవులు, సముద్రాలు, నదీ మార్గాల ద్వారా బ్రిటన్‌లో అడుగుపెడుతున్న శరణార్థులను అక్కడి పోలీసులు పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారు స్థిరపడేందుకు సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో అక్కడి జనాభాకన్నా శరణార్థులే ఎక్కువగా పెరిగిపోతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, సిరియా వంటి దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి.

స్థానికులపై దాడులు..
ఈ శరణార్థులు స్థానిక మహిళలు, యువతలపై దాడులు, లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు పెరిగాయి. కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం ఈ సమస్యలను విస్మరించి, ఫిర్యాదు చేసిన బ్రిటిష్‌ పౌరులపైనే విదేశీయులను అవమానిస్తున్నారని రేసిజం కేసులు పెడుతోంది. ఇది స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.

11 నగరాలపై వలసదారుల పట్టు.
బ్రిటన్‌లోని 11 నగరాల్లో వలసదారులు విపరీతంగా పెరిగాయి. అక్కడ స్థానికులే మైనారిటీలుగా మారారు. దీంతో మెజారిటీగా ఉన్న శరణార్థులు మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ 11 నగరాల్లోనే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంతో అక్కడి జనాభా పెరిగి స్థానిక పాలకులుగా కూడా వలసవాదులే ఎన్నికవుతున్నారు. ఈ నగరాల్లో ముస్లిం మేయర్లు, నాయకులు శరణార్థులను సమర్థిస్తూ చేరదీస్తున్నారు.

హోటళ్ల వద్ద నిరసన..
ప్రభుత్వం, వలసదారులు కలిసి స్థానికులకే సమస్యగా మారడంతో 11 నగరాల్లో ప్రజలు రోడ్డెక్కారు. పాలకుల తీరుకు, శరణార్ధుల దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరణార్థులను దేశం నుంచి పంపించాలని డిమాండ్‌ చేశారు. అయితే కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం ఆందోళన కారులను అరెస్టు చేసి నిరసనను అణచివేసింది.

ఈ సంఘటనలు బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ విధానాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. శరణార్థుల పునరావాసం నేరాలు పెరగడానికి కారణమవుతోంది. సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం ఫిర్యాదులను అణచివేయడం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచుతూ, దేశవ్యాప్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. భవిష్యత్తులో కఠిన చట్టాలు, సమతుల్య విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper