UAE
UAE: యూఏఈ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్(United Arab Emirates).. ఉపాధి నిమిత్తం విద్యాభ్యాసం తక్కువగా ఉన్న భారతీయులు ఈ దేశానికి వెళ్తుంటారు. అక్కడ నిర్మాణరంగంతోపాటు ఇతర సంస్థల్లో పనిచేస్తుంటారు. అయితే కొందరు విజిట్ వీసాపై వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. కొందరు గడువు ముగిసినా తిరిగి రావడం లేదు. ఇలాంటి వారిని అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు.
Also Read: త్వరలో పుతిన్ చనిపోతారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ అద్యక్షుడు!
రంజాన్(Ramzan) సందర్భంగా యూఏఈలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. 2025లో, ఈ పవిత్ర మాసం ప్రారంభానికి ముందు, యూఏఈ అధ్యక్షుడు(Prasident) షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. అదే సమయంలో, ప్రధానమంత్రి(Prime minister)షేక్ మొహమ్మదఅ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 1,518 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో అమలైన ఈ నిర్ణయంలో 500 మందికి పైగా భారతీయ ఖైదీలు కూడా విడుదలయ్యారు.
ఆనవాయితీ…
రంజాన్ సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించడం యూఏఈలో ఆనవాయితీగా వస్తోంది. ఈ చర్య దయ, క్షమాగుణం, సామాజిక పునరావాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జరుగుతుంది. విడుదలైన ఖైదీలు తమ కుటుంబాలతో గడపడానికి అవకాశం పొందడమే కాక, ఆర్థిక బాధ్యతల నుంచి∙కూడా విముక్తి పొందారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఈ ఖైదీల ఆర్థిక భారాన్ని స్వీకరించారని సమాచారం, దీనివల్ల వారు కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు మార్గం సుగమమైంది.
ఈ నిర్ణయం భారత్–యూఏఈ(India – UAE)మధ్య స్నేహ సంబంధాలకు మరింత బలం చేకూర్చింది. దుబాయ్‌లోని జైళ్లలో ఉన్న వివిధ దేశాల ఖైదీలకు ఈ క్షమాభిక్ష వర్తించగా, భారతీయ సమాజంలో ఈ చర్య సంతోషాన్ని నింపింది. యూఏఈ పాలకుల ఈ దయాగుణం వారి మానవతాత్మక విధానాన్ని చాటుతోంది.
ఏటా భారతీయులకు అవకాశం..
ప్రతి ఏడాది రంజాన్‌లో ఈ విధంగా వందలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ఇవ్వడం యూఏఈలో ఆనవాయితీ. ఈ సంవత్సరం భారతీయులతో పాటు వివిధ జాతీయులు కూడా ఈ క్షమాభిక్షలో భాగమయ్యారు. ఈ నిర్ణయం భారత్–యూఏఈ మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. దుబాయ్‌లోని శిక్షాసంస్థల నుండి విడుదలైన వారిలో ఈ భారతీయులు ఉన్నారు, ఇది యూఏఈ పాలకుల దయాగుణాన్ని సూచిస్తూ భారతీయ సముదాయంలో సానుకూల స్పందనలను రేకెత్తించింది. ఈ క్షమాభిక్ష ప్రక్రియలో ఖైదీల శిక్షలు తగ్గించడం, వారి మంచి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసుల సహకారంతో విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ చర్య రంజాన్ ఆధ్యాత్మిక ఉద్దేశాలకు అనుగుణంగా, క్షమాగుణం మరియు సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Uae pardons 500 indian prisoners ramzan 2025
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com