Turkey Vs US: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యురోపియన్ యూనియన్ షాక్ ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే భారత్‌పై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ ఆదేశాలను యురోపియన్ యూనియన్ లెక్క చేయలేదు. ఇక భారత్ నుంచి ఆయిల్ దిగుమతులు నిలిపివేయాలన్న ఆదేశాలనూ పట్టించుకోలేదు.. తాజాగా టర్కీ కూడా అమెరికాకు ఝలక్ ఇచ్చింది. రష్యా నుండి గ్యాస్ దిగుమతులను నిలిపివేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించటం టర్కీ విదేశాంగ విధానంలో స్వతంత్ర దృక్పథాన్ని మరోసారి చూపించింది.
నాటోలో విభిన్న సభ్యదేశాలు ..
టర్కీ, నాటో సభ్యదేశంగానే ఉన్నప్పటికీ రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తోంది. ఇది ఆమెురికా నేతృత్వంలోని పాశ్చాత్య బ్లాక్‌లో విభిన్న అభిప్రాయాలను వెలికి తేవడం గమనార్హం. ఇరాన్, రష్యా వంటి దేశాలతో సహకారాన్ని పెంచే టర్కీ వైఖరి, నాటోలో వ్యూహాత్మక అస్పష్టతను సూచిస్తోంది.
ట్రంప్ నాయకత్వంపై విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటోపై తగిన అనుసంధానం చూపలేకపోతున్నారని, సభ్య దేశాల మధ్య ఐక్యతను నిలబెట్టడంలో విఫలమయ్యారని పాశ్చాత్య విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నాటో ఐక్యతను కాపాడలేనివాడు ప్రపంచ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తాడని?’’ అనే విమర్శలు సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో చురుకుగా వినిపిస్తున్నాయి.
టర్కీ వ్యూహం..
పాశ్చాత్య ఆంక్షల మధ్య ఇంధన భద్రతను సురక్షితంగా ఉంచుకోవడం టర్కీ ప్రధాన ధ్యేయంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ గ్యాస్ దిగుమతులపై స్థిరంగా ఆధారపడడంతో, రష్యా సరఫరా వ్యవస్థకు ప్రత్యామ్నాయం తక్షణంలో సాధ్యంకాదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే టర్కీ, పాశ్చాత్య ఒత్తిడిని మించి తన ప్రయోజనాలను కాపాడుతున్నది.
తాజా పరిణామం నాటో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తింది. రష్యా, చైనా వంటి దేశాలు ఈ విభేదాలను తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇంధన సరఫరాలో పాశ్చాత్య ఏకాభిప్రాయానికి భంగం కలగడం యూరోపియన్ భద్రతా వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు.