Rajamouli Birthday: తెలుగు చలన చిత్ర పరిశ్రమ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) పుట్టినరోజు సందర్భంగా నేడు సోషల్ మీడియా మొత్తం ఆయనపై శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. సెలబ్రిటీలందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. కాసేపటి క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు(super star mahesh babu) ఒక ట్వీట్ వేసాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తో కలిసి ‘వారణాసి'(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో రాజమౌళి తో కలిసి దిగిన ఒక ఫోటో ని షేర్ చేసాడు. ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా పండుగ లాగా సెలబ్రేట్ చేసుకునే ఫ్యాన్స్ కి, ఇలా మహేష్ బాబు సర్ప్రైజ్ ఇస్తూ ట్వీట్ వేయడం వాళ్లకు వేరే లెవెల్ లో అనిపించింది. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫోటోనే కనిపిస్తుంది.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ ‘రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీ నుండి మరో ది బెస్ట్ మూవీ రాబోతుంది సార్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు, రాజమౌళి ముఖాల్లో ఉన్న ఆనందం చూసి అభిమానులకు కడుపు నిండిపోయింది. మంచి సినిమా చేస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి స్వచ్ఛమైన ఆనందం ముఖాల్లో కనిపిస్తాదని, రాజమౌళి, మహేష్ లేటెస్ట్ మూవీ షూటింగ్ అందుకు ఒక ఉదాహరణగా నిలబడబోతుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని నవంబర్ నెలలో గ్రాండ్ గా రివీల్ చేయబోతున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా టైటిల్ పై సంతృప్తి గా లేరు. హాలీవుడ్ తరహా సినిమా ని తీస్తున్నామని చెప్పారు, అలాంటి సినిమాకు ఇలాంటి టైటిల్ ఏంటి అని మండిపడుతున్నారు. ఇదే టైటిల్ నిజమైతే సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవడం తగ్గించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అధికారిక టైటిల్ అది కాదని, రాజమౌళి నాలుగైదు టైటిల్స్ ని అనుకుంటున్నాడని, అందులో ‘వారణాసి’ కూడా ఒక టైటిల్ అని, ఫ్యాన్స్ అభిప్రాయం తెలుసుకోవడం కోసం చిన్నపాటి లీక్స్ ఇచ్చారని, ఫ్యాన్స్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు కాబట్టి కచ్చితంగా ఆ టైటిల్ పెట్టే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు కూడా నవంబర్ నెలలోనే తెలియనున్నాయి. రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో ఉంటుందని, సంజీవని కోసం మహేష్ చేసే ప్రయాణమే ఈ సినిమా అని అంటున్నారు. ఈ చిత్రం తో రాజమౌళి హాలీవుడ్ మార్కెట్ లో జెండా పాతేయాలని చూస్తున్నాడు. మరి ఆ రేంజ్ కి చేరుకుంటాడా లేదా అనేది చూడాలి.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come..Have a great one sir ♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025