spot_img
Homeఅంతర్జాతీయంDonald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై సుంకాలు విధించడంతోనే సరిపెట్టారు. ఈ క్రమంలో చాలా దేశాలపై 20 శాతం నుంచి 100 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించారు. తాజాగా రెండు రోజుల క్రితం కూడా కార్మికుల సంరక్షణ చర్యలు చేపట్టకుండా తమకు సరుకులు ఎగుమతి చేస్తున్నారంటూ సుంకాలు విధించారు. కానీ ఈ సుంకాల ప్రభావంతో అనేక దేశాల ఎగుమతుల ప్రభావితం అయ్యాయి. తనదాకా వస్తే కానీ నొప్పి తెలియదు అన్నట్లు అమెరికా కంపెనీలపై యురోపియన్‌ యూనియన్‌(ఈయూ) భారీగా జరిమానాలు విధిస్తుండడంతో ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఈయూ జరిమానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అమెరికా సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అధిక జరిమానాలు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై సెక్షన్‌ 301 కింద విచారణ ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఈయూపై అదనపు దిగుమతి పన్నులు విధిస్తామని వార్నింగ్‌ ఇచ్చాడు.

ట్రూత్‌ సోషల్‌లో పోస్టు..
ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ పోస్టులో యూరోపియన్‌ యూనియన్‌ అమెరికా కంపెనీలను ఆదాయ వనరుగా చూస్తోందని విమర్శించారు. ఎలాంటి సరైన కారణం లేకుండా యాపిల్‌కు 15 బిలియన్‌ డాలర్లు, మెటాకు 3 బిలియన్‌ డాలర్లు, అమెజాన్‌కు 2.5 బిలియన్‌ డాలర్లు విధించిన తర్వాత గూగుల్‌కు మరో బిలియన్‌ డాలర్‌ జరిమానా విధించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ అన్యాయమైనవి, అమెరికా సంస్థలపై వివక్ష చూపేవి అని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిందని ట్రంప్‌ ఆరోపించారు. తన ప్రభుత్వం అటువంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల ప్రయోజనాలను కాపాడటం తమ బాధ్యత అని స్పష్ట చేశారు.

సెక్షన్‌ 301 విచారణ అంటే..
అమెరికా ట్రేడ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 301 ప్రకారం ఇతర దేశాలు అమెరికా వ్యాపారాలపై అన్యాయమైన చర్యలు తీసుకుంటున్నాయనే అనుమానం ఉంటే ప్రభుత్వం విచారణ చేపట్టవచ్చు. ఆరోపణలు నిజమని నిర్ధారణైతే సంబంధిత దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారం ఉంటుంది. ట్రంప్‌ ఈ మార్గంలోనే ముందుకు వెళ్తామని ప్రకటించారు.

ఈయూ ఏమంటోంది..
యూరోపియన్‌ యూనియన్‌ ఈ జరిమానాలు చట్టబద్ధమైన నియమాల ప్రకారమే విధిస్తున్నామని చెబుతోంది. మరోవైపు ట్రంప్‌ హెచ్చరికతో అమెరికా–ఈయూ వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. అమెరికా నిజంగా భారీ సుంకాలు విధిస్తే రెండు పక్షాల మధ్య వాణిజ్యం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది.

ట్రంప్‌ తీసుకునే నిర్ణయాలు ఇప్పటికే పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. అనేక నిర్ణయాలను అమెరికా కోర్టులు తప్పు పట్టాయి. ఉప సంహరించుకోవాలని ఆదేశించాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ఈయూకు ట్రంప్‌ చేసిన హెచ్చరికలు ఎటు దారితీస్తాయో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Oktelugu Epaper