Homeఅంతర్జాతీయంTrump Security Scare: ప్రాణ భయంతో ట్రంప్.. యుద్ధ ప్రాతిపదికన తరలించారు.. అమెరికాలో ఏం జరుగుతోంది..

Trump Security Scare: ప్రాణ భయంతో ట్రంప్.. యుద్ధ ప్రాతిపదికన తరలించారు.. అమెరికాలో ఏం జరుగుతోంది..

Trump Security Scare: అమెరికా ప్రజల చేతిలో.. ప్రపంచ దేశాల అధినేతల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలకు గురవుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రాణ భయం పట్టుకుంది. ఆయనను సెక్యూరిటీ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన అత్యంత సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. దీంతో అమెరికాలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది.

ట్రంప్ అధికారిక నివాసం వైట్ హౌస్ లో.. కరస్పాండెంట్స్ డిన్నర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. అందరూ టేబుల్ ముందు కూర్చొని అక్కడ వడ్డించిన ఆహార పదార్థాలను తినడానికి ప్రయత్నిస్తుండగా గందరగోళం ఏర్పడింది. ఏదో పేలుడు వంటి శబ్దం వినిపించింది. అది తుపాకి నుంచి వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే ట్రంప్ అంగరక్షక బృందం అప్రమత్తమైంది. ట్రంప్ ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించింది. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు.. పాత్రికేయులు హాజరయ్యారు. వారంతా కూడా టేబుల్ కింద కూర్చొని ప్రాణాలను కాపాడుకున్నారు.

షూటింగ్ జరిగిందని.. వల్ల తుపాకి నుంచి బుల్లెట్ శబ్దం వినిపించిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే దీనిపై వైట్ హౌస్ సెక్యూరిటీ బృందం విచారణకు ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.. ఇతర ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు.. దీంతో వైట్ హౌస్ లో భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు మీద ఫైరింగ్ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఆయన మీద కాల్పులు జరిపాడు. సమయంలో బుల్లెట్ ఆయన చెవిని తాకుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఘటనను ట్రంప్ పదేపదే ప్రచారం చేసుకున్నారు. తనకు మైలేజ్ వచ్చేలాగా చేసుకున్నారు. చివరికి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రపంచ దేశాల మీద సుంకాలు విధించారు. అమెరికాలో నివాసం ఉంటున్న వారిపై అక్రమ వలసదారులు అనే ముద్ర వేసి.. యుద్ధ ఖైదీల మాదిరిగా తరలించారు. ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న అమెరికాకు ట్రంపు చేస్తున్న ద్రోహాలు మామూలుగా లేవని అక్కడ మీడియా చెబుతోంది. దీనికి తోడు అమెరికా ప్రజలు ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి ఏడాదికాకముందే ట్రంప్ ఇంతటి స్థాయిలో నిరసన ఎదుర్కొనడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని అక్కడి మీడియా చెబుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version