Chiranjeevi And Pawan Kalyan: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. మెగాస్టార్ గా అవతరించిన ఆయన ఇండస్ట్రీ లో ఉన్న భారీ రికార్డులను కొల్లగొట్టాడు. వరుసగా 6 సంవత్సరాలు 6 ఇండస్ట్రీ హిట్లను దక్కించుకున్న ఘనత కూడా తనకే దక్కింది. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన ఒక రెండు సినిమాలను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారట. కారణం ఏంటి అంటే అది చిరంజీవి ఇమేజ్ కి తగ్గ కథలు కాదని అందువల్లే సినిమాలైతే రిజెక్ట్ చేశానని గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. చిరంజీవి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నెగెటివ్ క్యారెక్టర్ లో ఉన్న ఒక సినిమాకు సైన్ చేశారట.
కానీ అప్పుడు చిరంజీవిని నెగెటివ్ షేడ్స్ లో చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చిరంజీవికి చెప్పి మొత్తానికైతే ఆ సినిమాను క్యాన్సిల్ చేసేలా చేశాడు… దాంతోపాటుగా చిరంజీవి రాముడి అవతారంలో కనిపించడానికి కూడా ఒక సినిమా చేయడానికి ఇతర దర్శకులతో సన్నాహాలు చేసుకున్నాడు.
కానీ పవన్ కళ్యాణ్ సైతం రాముడి గెటప్ లో చిరంజీవిని పెద్దగా ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరని ఆ క్యారెక్టర్ తనకు అంత బాగా సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఆ సినిమా చేయవద్దని చెప్పాడట. మొత్తానికైతే చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను పర్సనల్ గా తీసుకొని దానిమీద రీసెర్చ్ చేసి మరి ప్రేక్షకులు చిరంజీవి నుంచి రాముడి గెటప్ ని ఎక్స్పెక్ట్ చేయడం లేదనే ఒక క్లారిటికి వచ్చాడు.
ప్రేక్షకులు అతని నుంచి శివుడి గెటప్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుసుకున్న చిరంజీవి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘శ్రీ మంజునాథ’ అనే సినిమా చేసి సక్సెస్ ను సాధించాడు… మొత్తానికైతే పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవి రెండు సినిమాలను రిజెక్ట్ చేశాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి… ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలను చేస్తుంటే పవన్ కళ్యాణ్ అటు ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తూనే సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తు ప్రేక్షకులను అలరిస్తున్నాడు…