దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం ఆయనకు ఇండియా వైడ్ గా అభిమానులైతే ఉన్నారు. మహేష్ తో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళి ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా అదే క్లారిటి మైంటైన్ చేయాలని చూస్తున్నాడు. రాజమౌళి తీసే ప్రతి సినిమా కి కథను వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ అందిస్తుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ కి రాజమౌళి లో నచ్చిన ఒక విషయం ఒకటి ఉందట. అది ఏంటంటే రాజమౌళి ఒక సినిమా చేసే సమయంలో ఆ సినిమా మీదనే పూర్తి ఫోకస్ ని పెడతాడు. అది చాలా మంచి విషయం వేరే సినిమా గురించి అసలు ఆలోచించాడు అది ఆయనలో నాకు నచ్చిన విషయం…
ఇక నచ్చని విషయం కూడా ఒకటి ఉందట అదేంటంటే రాజమౌళి సినిమా చేసేలోపు విజయేంద్రప్రసాద్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేద్దాం అని రాజమౌళిని అడిగినప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించడు. కాబట్టి తనకు ఎలాంటి ఐడియాలు చెప్పడట. ప్రస్తుతం చేస్తున్న సినిమా రిలీజ్ అయిన వెంటనే కొన్ని ఐడియాలు చెప్పి చాలా తొందరగా మనకి కథ కావాలి అని చెబుతారట.
ఈ విషయం విజయేంద్ర ప్రసాద్ కి నచ్చదట. తను ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్టు ఏం చేస్తున్నాం అనేది ఒక చిన్న లైన్ చెప్పిన కూడా దానికి సంబంధించిన కథ మీద నేను వర్క్ చేసుకుంటాను కదా… కానీ రాజమౌళి మాత్రం అప్పుడు చెప్పకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక లైన్ చెప్పి నాకు అర్జెంటుగా కథ కావాలి అంటాడు.
నాకు రాజమౌళి లో అసలు నచ్చని విషయం ఇదే అంటూ విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా నిలుస్తుంది. ప్రతి సినిమాతో ఒక బెంచ్ మార్కును సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి వీళ్లను ఢీకొట్టేవారు ఎవరు లేరు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
