Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Orange Cap: ఒక్క రోజులోనే నలుగురి తలలు మారిన ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్...

IPL 2026 Orange Cap: ఒక్క రోజులోనే నలుగురి తలలు మారిన ఆరెంజ్ క్యాప్.. ఐపీఎల్ లో ఇదో అద్భుతం

IPL 2026 Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి.. 264 పరుగులు చేసిన సరే.. ఆ స్కోరును కాపాడుకోవడం కష్టమవుతోంది. సెంచరీలు చేసినా సరే గెలవడం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాదు ఐపిఎల్ లో ఈసారి ఆరెంజ్ క్యాప్ కూడా జట్ల మాదిరిగానే దోబూచూలాట ఆడుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకరోజు లోనే నలుగురు ప్లేయర్ల తలలు మారింది ఆరెంజ్ క్యాప్.

ఐపీఎల్ లో ఈసారి రాజస్థాన్ ప్లేయర్ సూర్య వంశీ, బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ, హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ, ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లీ మాత్రమే సెంచరీ చేయలేదు. పైగా విరాట్ కోహ్లీ వయసు కూడా 37 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు యంగ్ ప్లేయర్లతో సమానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.. ఏ విధంగా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అవతరించాడు.. విరాట్ కోహ్లీ కంటే ముందు వైభవ్ సూర్య వంశీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగాడు. విరాట్ కోహ్లీ ఇటీవల మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు.. దీంతో అతడు ఒకసారిగా హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ప్రస్తుత ఐపీఎల్ లో 328 పరుగులు చేశాడు .. శనివారం మధ్యాహ్నం వరకు అతడే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగాడు. మధ్యాహ్నం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 150కి మించి పరుగులు చేయడంతో.. ఒక్కసారిగా అతడు ఆరెంజ్ క్యాప్ విభాగంలోకి వచ్చాడు.. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో 357 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ సెంచరీ చేశాడు. దీంతో అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా మారిపోయాడు. అతడు ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో 357 పరుగులు చేశాడు.. అయితే ఈ ఆనందం సూర్య వంశీ కి ఎంతసేపో దక్కలేదు. కొద్దిసేపటికే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ (380) సూర్య వంశీ ని దాటేశాడు. మొత్తంగా ఒక్కరోజులోనే ఆరేంజ్ క్యాప్ నలుగురు ప్లేయర్ల తలలు మారింది. ఈ ఐపీఎల్ ఇదొక సంచలనమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈసారి బ్యాటర్లు అదరగొడుతున్నారు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్లను ఏమాత్రం లెక్కచేయడం లేదు.. అందువల్లే ఆరెంజ్ క్యాప్ విభాగానికి ఈసారి విపరీతమైన పోటీ ఉంది. ఒక్క రోజులో ఆరెంజ్ క్యాప్ నలుగురు ప్లేయర్ల తలలు మారింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version