What is Trump strategy: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. అక్కడి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లతోపాటు అమెరికాలో ఉంటున్న విదేశీయులను ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో బడ్జెట్ రూపొందించారు. దీంతో ఎన్నికల నాటి నుంచి ట్రంప్ వెంట ఉన్న ప్రపంచ కుబేరుడు, డోజ్ చైర్మన్ పదవి నుంచి తప్పించుకున్నాడు. ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బిగ్ బ్యూటిఫుట్ బిల్లుతో అమెరికా అప్పులు 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. అయినా ట్రంప్ తన బిల్లుకు ఆమోదం పొందేలా చేశాడు. ఈ క్రమంలో మస్క్‌ను వదిలేసిన ట్రంప్ ఇప్పుడు మెటా సీఈవోను వెంటపెట్టుకోవడం చర్చనీయాంశమైంది.
ఓవల్ ఆఫీసులో జూకర్‌బర్గ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీసులో ఎఫ్–47 స్టెల్త్ యుద్ధ విమానాలపై అత్యంత రహస్య సమావేశం నిర్వహిస్తుండగా, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ అనుకోకుండా గదిలోకి ప్రవేశించిన ఘటన ఆశ్చర్యం కలిగించింది. ఈ సమావేశంలో మిలిటరీ ఉన్నతాధికారులు యుద్ధ విమానాల సామర్థ్యాల గురించి చర్చిస్తుండగా, జుకర్బర్గ్ రాక మిలిటరీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. జుకర్బర్గ్‌కు ఎలాంటి సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండానే ఈ రహస్య సమావేశంలోకి ప్రవేశించారని, దీంతో భద్రతా సిబ్బంది ఆయనను బయటకు పంపినట్లు తెలిపాయి. ఈ ఘటన భద్రతా లోపంగా పరిగణించబడుతుండగా, వైట్ హౌస్ అధికారులు దీన్ని ఖండించారు.
Also Read: ఆ వైసీపీ కీలక నేతకు అండగా కూటమి ఎంపీలు?
ట్రంప్ ఆహ్వానం మేరకే..
వైట్ హౌస్ సీనియర్ అధికారి ఈ ఘటనపై స్పష్టత ఇస్తూ, జుకర్బర్గ్ ట్రంప్ ఆహ్వానం మేరకే ఓవల్ ఆఫీసుకు వచ్చారని, అధ్యక్షుడిని పలకరించి, షెడ్యూల్ చేసిన భేటీ కోసం బయట ఎదురుచూశారని వెల్లడించారు. మిలిటరీ సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్, జుకర్బర్గ్ సమావేశమైనట్లు సమాచారం.
ట్రంప్–జుకర్బర్గ్ సంబంధాలు..
ట్రంప్, జుకర్బర్గ్ మధ్య సంబంధాలు గతంలో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. 2021లో క్యాపిటల్ హిల్ దాడి తర్వాత, మెటా ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించడంతో వీరి సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో జుకర్బర్గ్ ట్రంప్‌కు మద్దతుగా 1 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించి, ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవడంతో వీరి సంబంధాలు మళ్లీ మెరుగుపడ్డాయి. ఈ ఘటన ఈ కొత్త స్నేహబంధం యొక్క బలాన్ని సూచిస్తుంది.
Also Read: ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు!
ఈ ఘటన రెండు కోణాలను బహిర్గతం చేస్తుంది. మొదటిది, ఓవల్ ఆఫీసు వంటి రహస్య సమావేశాలలో భద్రతా ప్రోటోకాల్స్ యొక్క ప్రాముఖ్యత. రెండవది, ట్రంప్, జుకర్బర్గ్ మధ్య సంబంధాలు రాజకీయ, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా బలపడుతున్నాయని సూచిస్తుంది. జుకర్బర్గ్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అజెండాకు మద్దతు ప్రకటించడం, విరాళం ఇవ్వడం వంటివి ఈ సంబంధం రాజకీయ, వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.