Trump India Russia oil Import: మన దేశంలో మన ప్రభుత్వాలు చెప్పే మాటలను వినని, నమ్మని ఒక పెద్ద వర్గం ఉంది. ఇది భారత దురదృష్టం, బీజేపీ చెబితే అస్సలే నమ్మదు. మోదీ చెపితే ఇంకా నమ్మదు. ట్రంప్ చెబితే మాత్రం అది బ్రహ్మవాక్కుగా భావిస్తారు. తాజాగా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం. ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. దానిపై ఎలాంటి టారిఫ్‌లు ఉండవు అని ప్రకటించాడు. దీంతో వెంనటే మన దేశంలోని ఆ వర్గంతోపాటు విపక్షాలు ఒక్కసారిగా నిద్రలేచాయి. అదిగదిగో మన మోదీగారు ట్రంప్‌కు దాసోహమయ్యారు. ట్రంప్ ఆదేశించడంతో రష్యా ఆయిల్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. లేదంటే ఆయిల్ కొనుగోలు చేసేవారు కాదు. ఇరాన్ యుద్ధం కారణంగా మనకు నష్టం జరిగేది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక మన మీడియా, పత్రికలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా రష్యా ఆయిల్ దిగుమతికి అమెరికా అనుమతి అని రాశాయి.
Also Read: రామ్ చరణ్ ఓకే చేసిన రెండు సినిమాలను చిరంజీవి క్యాన్సల్ చేశాడా? కారణమేంటంటే..?
ట్రంప్ ప్రకటన నేపథ్యం..
ట్రంప్ ఇటీవల భారత్‌కు రష్యా ఆయిల్ దిగుమతులకు అనుమతి ఇస్తామని, టారిఫ్‌లు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇది ఇరాన్ యుద్ధం, ఆర్మూజ్ జలసంధి మూతల నేపథ్యంలో వచ్చింది. వాస్తవం ఏమిటంటే అమెరికా ఎనర్జీ సెక్రటరీ భారత్‌ను ఎక్కువ ఆయిల్ కొనుగోలు చేసి యూరప్‌కు సరఫరా చేయమని అర్థించాడు. బతిమిలాడాడు. ప్రాధేయపడ్డాడు.
భారత్ స్వాతంత్య్రం
భారత్ నాలుగేళ్లుగా రష్యా నుంచి రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెంచింది. ట్రంప్ టారిఫ్ ఒత్తిళ్లు పట్టి ఆగలేదు. ఇరాన్ యుద్ధనౌక ’లవాన్’కు కేరళలో ఆశ్రయం ఇవ్వడం, దేనాకు సూచనలు ఇవ్వడం భారత్ భయపడలేదని చూపించాయి.
వాస్తవం తెలుసుకోకుండా విమర్శలు..
ఇక మన దేశంలో విపక్షాలు, కొంతమంది ట్రంప్ ప్రకటనను మోదీ ’దాసోహం’గా చిత్రీకరిస్తున్నారు. మీడియా కూడా వాస్తవాలు విస్మరించి ’అనుమతి’గా వర్గీకరించింది. ఇరాన్ యుద్ధం వల్ల గల్ఫ్ ఉత్పత్తి ఆగడం, యూరప్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా భారత్‌ను ఆధారపడింది. కానీ అలా ప్రచారం కాకుండా, ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు.
ఎందుకు ప్రాధేయం..
అమెరికా భారత్‌ను ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏమిటి అంటే.. ఇరాన్ యుద్ధం కారణంగా యూరప్‌లో ఆయిల్ సంక్షోభం రాబోతోంది. యుద్ధం కారణంగా ఆర్మూజ్ జలసంధి మూసివేసింది. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో యురోపియన్ యూనియన్ దేశాలు ఇబ్బంది పడే పరిస్థితి రాబోతోంది. దీంతో అమెరికాపై యురోపియన్ యూనియన్ దేశాల్లో వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో అలర్ట్ అయిన అమెరికా తమపై వ్యతిరేకత రాకుండా ఉండేందకు భారత్‌ను వేడుకుంది.
భారత్‌లో ఇరాన్ యుద్ధ నౌక..
భారత్ ట్రంప్‌కు భయపడితే ఇరాన్‌కు చెందిన లవాన్ యుద్ధ నౌకకు కేరళలోని కొచ్చి తీరంలో మార్చి 4 నుంచి నిలిపి ఉంచేది కాదు. నౌకా సిబ్బందికి ఆశ్రయం ఇచ్చేది కాదు. మరో యుద్ధ నౌక దేనా కూడా ఇరాన్ వెళ్లొద్దని భారత్ సూచించింది. అయినా వినకుండా వెళ్లింది. దీంతో శ్రీలంకలోని గాలేకి 20 నాటికల్ మైళ్ల దూరంలో అమెరికా సబ్‌మెరైన్ దానిని కూల్చింది. మన మాట విని ఉంటే లవాన్లాగా సురక్షితంగా ఉండేది. భారత్ అమెరికాకు భయపడడం లేదనేది దీనిద్వారా అర్థమవుతుంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో..
ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ మన విమానాలు ఎన్ని కూలాయి. ఎంత మంది సైనికులు చనిపోయారని ప్రశ్నించారు. మనం కూల్చిన విమానాలు, చంపిన ఉగ్రవాదులు, ధ్వంసం చేసిన స్థావరాల గురించి అడగలేదు. ట్రంప్ చెప్పే మాటలే నమ్మారు. కానీ, తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నామని అనే పరిస్థితి కూడా లేదు.