H 1B Visa Rules Changes: డొనాల్డ్ ట్రప్.. వీడొక పిచ్చోడని మొదటి సారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడే అందరికీ అర్థమైంది. రెండోసారి ఎన్నిల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైట్‌హౌస్‌పై దాడి చేయడం వివాదాస్పదమైంది. అయినా గతేడాది జరిగిన ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశాడు. ఈసారి మెజారిటీ అమెరికన్లు అమెరికా ఫస్ట్ విధానానికి ఆకర్షితులయ్యారు. కానీ, ఈ నినాదం పేరుతో ట్రంప్ చేస్తున్న అరాచకాలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలు విధించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని స్వదేశాలకు పంపించాడు. ఇప్పుడు హెచ్–1బీ వీసా చార్జీలు భారీగా పెంచాడు. కానీ, 24 గంటలు గడవక ముందే తన నిర్ణయం మార్చుకున్నాడు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సమయంలో, కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లట్నిక్ ప్రతి ఏటా లక్ష డాలర్ల ఫీజు విధించాలని ప్రకటించారు. ఈ మార్పు హెచ్–1బీ వీసా కార్యక్రమాన్ని సుస్థిరపరచడానికి, అమెరికన్ కార్మికుల ఉద్యోగాలను కాపాడటానికి ఉద్దేశించినదిగా పేర్కొన్నారు. పెద్ద సంస్థలు ఈ మార్పుకు అంగీకరించాయని, ఇది ఉద్యోగుల ఎంపికలో ఉత్తములను మాత్రమే ఆకర్షిస్తుందని చెప్పారు. అయితే, ఈ ప్రకటనలో ఫీజు ఎవరికి, ఎలా వర్తిస్తుందనే వివరాలు స్పష్టంగా లేవు. కానీ ట్రంప్ నిర్ణయం విమర్శలకు దారితీసింది.
24 గంటల్లో మార్పు..
శనివారం(సెప్టెంబర్ 20న) ఎగ్జిక్యూటివ్ సంతకం చేశారు. ఆదివారం వైట్‌హౌస్ మరో ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. కొత్త అప్లికేషన్లకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుందని, ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్ల పునరుద్ధరణలకు కాదని స్పష్టం చేశారు. ఈ మార్పు మొదటి ప్రకటనలో లట్నిక్ చెప్పిన వార్షిక ఫీజు భావనకు విరుద్ధంగా ఉంది. ఇది ప్రభుత్వంలోని అంతర్గత అసమ్మతిని బయటపెట్టింది. ఈ స్పష్టీకరణ టెక్ ఇండస్ట్రీలోని ఆందోళనలను తగ్గించే ప్రయత్నంగా కనిపించినప్పటికీ, మొదటి ప్రకటన వల్ల ఏర్పడిన గందరగోళం ఇంకా తగ్గలేదు.
మార్పు కారణాలు..
ఈ త్వరిత మార్పు వెనుక టెక్ దిగ్గజాల నుంచి వచ్చిన వ్యతిరేకత, ఆర్థిక ప్రభావాలు, చట్టపరమైన సవాళ్లు కారణాలుగా భావిస్తున్నారు. హెచ్–1బీ వీసాలు భారత, చైనా వంటి దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులను ఆధారపడి ఉంటాయి. వార్షిక ఫీజు అంటే సంస్థలకు భారీ ఆర్థిక భారం. వైట్‌హౌస్ మార్పు కొత్త అప్లికేషన్లతో పరిమితం చేయడం ద్వారా, ఇప్పటి ఉద్యోగులను కాపాడటానికి ప్రయత్నించారు, కానీ ఇది ప్రభుత్వ విధానాల్లో అస్థిరతను బహిర్గతం చేసింది. ఫలితంగా, టెక్ రంగంలో ఉద్యోగాలు, విదేశీ ప్రతిభ ఆకర్షణపై ప్రభావం పడవచ్చు. ఇలాంటి మార్పులు భవిష్యత్ విధానాలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి.
ట్రంప్ ప్రభుత్వం హెచ్–1బీ ఫీజు విషయంలో 24 గంటల్లోనే మార్పు విధాన రూపకల్పనలోని లోపాలను, రాజకీయ–ఆర్థిక ఒత్తిళ్లను సూచిస్తుంది. ఇది అమెరికన్ కార్మికుల రక్షణకు ఉద్దేశించినప్పటికీ, విదేశీ ప్రతిభలపై ఆధారపడే టెక్ రంగానికి అనిశ్చితికి కారణమైంది. భవిష్యత్తులో స్పష్టమైన, స్థిరమైన విధానాలు అవసరం, లేకపోతే ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారే ప్రమాదం ఉంది.