spot_img
Homeఅంతర్జాతీయంTrump global stability threat: ట్రంపే ప్రమాదకరం.. ప్రపంచ స్థిరత్వానికి ముప్పు!

Trump global stability threat: ట్రంపే ప్రమాదకరం.. ప్రపంచ స్థిరత్వానికి ముప్పు!

Trump global stability threat: డొనాల్డ్‌ ట్రంప్‌.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఏడాది పూర్తిచేసుకున్నాడు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ప్రపంచ దేశాలపై సుంకాలు విధించి ఇబ్బంది పెట్టాడు. దీనిని అమెరికా సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఇక తాను అధికారంలోకి వస్తే యుద్ధాలు ఆపుతానని ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాక యుద్ధాలు ఆపిన దాఖలాలు లేవు. కానీ తనకు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని పలు దేశాలతో ప్రచారం చేయించుకున్నాడు. ఇక ఏడాది పాలన పూర్తి చేసుకున్న ట్రంప్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలపై యుద్ధాలు చేస్తూ మరింత ప్రమాదకరంగా మారాడు. జనవరిలో వెనెజువెలాపై దాడిచేసి ఆ దేశ అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చి దోషిగా న్యూయార్క్‌ కోర్టులో నిలబెట్టాడు. ఇప్పుడు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం చేస్తున్నాడు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఇపుపడు యుద్ధం నుంచి వెనక్కి రాలేక.. యుద్ధం గెలవలేక చిక్కుల్లో పడింది. దీంతో ప్రపంచ దేశాలను ఈ యుద్ధంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నాడు.

ఒంటరి నిర్ణయాలతోనే చిక్కులు..
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలు ఏర్పాటు చేసుకున్న ఐరోపా ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు యుద్ధాల నివారణకు కృషి చేస్తున్నాయి. అయితే ట్రంప్‌ ఏకపక్ష చర్యలతో వాణిజ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఒక వ్యవస్థ ఏర్పాటుకు సంవత్సరాలు అవసరమైతే, ట్రంప్‌ కూల్చివేత విధానాలు అవలంబిస్తున్నాడు. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో నుంచి బయటకు వచ్చాడు. ఐక్యరాజ్య సమితి ఆదేశాలు, సూచనలను లెక్క చేయడం లేదు.

Also Read: ఇరాన్‌ ఆఖరి అస్త్రం.. వాడితే వినాశనమే!

అమెరికాపై తిరుగుబాటు
ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై దాడి బెదిరింపులు ఇప్పుడు అమెరికాకు ఎదురుదెబ్బ తీస్తున్నాయి. ఇరాన్‌ ప్రతీకార దాడులతో చమురు, గ్యాస్‌ రంగాలు దెబ్బతింటూ, ప్రపంచవ్యాప్త ఆర్థిక అస్థిరత పెరిగింది. ఈ పద్ధతి మిత్రరాజ్యాలలో అమెరికా విశ్వాసాన్ని క్షీణింపజేస్తోంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు విస్తరిస్తే, అది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉంది, దీనివల్ల అమెరికాకు గణనీయ నష్టం సంభవిస్తుంది.

సామాన్యుల ఇబ్బంది
ట్రంప్‌ విధానాలు రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, ప్రపంచ మార్కెట్లను కుప్పకూలుతున్నాయి. సప్లయ్‌ చైన్‌ దెబ్బతిని, వాణిజ్య ఘర్షణలు పెరిగి, పౌరులు అధిక ధరలతో అల్లాడుతున్నారు. ప్రపంచ పెద్దన్నగా సమస్యలు పరిష్కరించాల్సిన అమెరికా.. అనేక సమస్యలకు కారణం అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper