Homeఅంతర్జాతీయంDonald Trump : అసలే తిక్కలోడు.. ఆపై మొండిఘటం.. అందుకే అమెరికా అధ్యక్షుడిగా.. రెండోసారి ఏం...

Donald Trump : అసలే తిక్కలోడు.. ఆపై మొండిఘటం.. అందుకే అమెరికా అధ్యక్షుడిగా.. రెండోసారి ఏం చేస్తాడో?

Donald Trump : ట్రంప్ గురించి చెప్పాలి అనుకుంటే.. పై మాటలు సరిపోతాయని అతడి అంతరంగికులు అనేక సందర్భాల్లో చెప్పారు. ట్రంప్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో దానినిబట్టి అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఎవరి మాటా వినడు. ఎవరు చెప్పిందీ వినిపించుకోడు. ముక్కోపిగా ఉంటాడు. ముక్కు సూటిగా మాట్లాడుతాడు. ప్రతి విషయంలోనూ ఏటికి ఎదురీత అనే సిద్ధాంతాన్ని అవలంబిస్తాడు. అందువల్లే చాలామంది ట్రంప్ ను వ్యతిరేకిస్తారు. కానీ ఒక్కసారి అతని ప్రేమించిన వారు ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించారు. ఇదే తన తత్వమని అనేక సందర్భాల్లో ట్రంప్ వ్యాఖ్యానించాడు.

వివాదాలకు చిరునామా

ట్రంప్ వివాదాలకు చిరునామాగా ఉంటారు. ఇదే విషయాన్ని ఆయన ఎదుట ప్రస్తావిస్తే నిశ్శబ్దంగా ఉండిపోతారు. అప్పుడు ఒకవేళ కోపం లో ఉంటే గట్టిగా వాదిస్తారు. ఆ సమయంలో తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే ఆయన మరింత రెచ్చిపోతారు. చిన్నప్పటినుంచి ట్రంప్ ప్రశ్నించే స్వభావాన్ని అలవర్చుకున్నారు. అందువల్లే తన మనసులో మాటను మొహమాటం లేకుండా చెబుతుంటారు. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడ్రిక్.. ఆయన సొంత దేశం జర్మనీ. తల్లి మేరి స్కాట్లాండ్ దేశానికి చెందిన మహిళ. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ ప్రాంతంలో 1946 జూన్ 14న ట్రంప్ జన్మించారు. చిన్నప్పటి నుంచి ట్రంప్ అత్యంత చిరుకుగా ఉండేవారు. 13 సంవత్సరాల వయసులో న్యూయార్క్ సైనిక అకాడమీలో ఆయన తండ్రి చేర్పించారు. అకాడమీలో ఆయన అద్భుతమైన క్రమశిక్షణ పెంపొందించుకున్నారు. అదే సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రోది చేసుకున్నారు. ఇక సైనిక అకాడమీ నుంచి ఫోర్దామ్ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాల పాటు విద్యనిభ్యసించారు. ఆ తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం తన తాతకు చెందిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్ సంస్థలు బిజినెస్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఇది మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై ట్రంప్ మెరిశారు. హోమ్ అలోన్ -2, లాస్ట్ ఇన్ న్యూయార్క్, అక్రాస్ ద సీ ఆఫ్ టైం, ద లిటిల్ రాస్కల్స్ వంటి చిత్రాలలో నటించారు. అంతేకాదు వ్యాపారంలోని అడుగు పెట్టారు. 1977లో ఇవానాను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 1992లో విడాకులు ఇచ్చారు. 1993లో మార్లా ను వివాహం చేసుకొని 99లో విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మూడో భార్య మేలానియా తో కలిసి ఉంటున్నారు. మొత్తంగా ట్రంప్ ఐదుగురు పిల్లలకు తండ్రి.

అప్పట్లోనే రాజకీయాల్లోకి రావాలని..

1970లోనే రాజకీయాల్లోకి రావాలని ట్రంప్ కలడుతున్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కు బలమైన మద్దతు దారుడిగా ట్రంప్ అవతరించారు. 1987లో తనకు తాను గానే రిపబ్లికన్ నేతగా ట్రంప్ ప్రకటించుకున్నారు . 19 88లో ట్రంప్ కు ఉపాధ్యక్షుడయ్యే అర్హతలు ఉన్నాయని అనేక పత్రికలు విశ్లేషించాయి. అయితే ఆయన ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించలేదు. 1999లో ఆయన రీ – ఫార్మ్ పార్టీ లో చేరారు. అందులో మూడు సంవత్సరాల పాటు ఉన్నారు. అప్పుడే ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయన ప్రయాణం స్వల్పకాలమే సాగింది. 2009లో రిపబ్లిక్ అభ్యర్థి జాన్ మెక్ కేయిన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇక 2011 డిసెంబర్లో తనను తాను ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ప్రకటించుకున్నారు. ఐదు నెలల తర్వాత మళ్లీ రిపబ్లికన్ పాతిలో చేరుతున్నట్టు ప్రకటించారు. అప్పట్లో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు ట్రంప్ భారీగా విరాళాలు ఇచ్చారు. ఒకానొక సందర్భంలో 2006, 2014లో న్యూయార్క్ గవర్నర్ గా పోటీ చేద్దామని ట్రంప్ భావించారు. కానీ ఆ తర్వాత ఆలోచన విరమించుకున్నారు.. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కొన్నిసార్లు కమల డిబేట్లలో ట్రంప్ పై పై చేయి సాధించింది. కానీ చివరికి ట్రంప్ నే విజయం వరించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular