US President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత.. ప్రపంచం మొత్తం అతడి పరిపాలన ఎలా ఉండబోతుందో అంచనా వేస్తోంది. ఈ క్రమంలో భారత మీడియా కూడా ట్రంప్ పరిపాలించే విధానంపై విశ్లేషణ చేసింది. ముఖ్యంగా అమెరికా – భారత సంబంధాలు ఎలా ఉంటాయోనని ఒక అంచనా వేసింది. ఎన్నికల ప్రచారం సమయంలో ” అమెరికాకు సంబంధించి ఫారిన్ అఫైర్స్ ను పునరుద్ధరిస్తామని” ట్రంప్ పదే పదే ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికైన తర్వాత.. తమ దేశానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో ట్రంప్ విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ ఒప్పందం అందులో ముఖ్యమైనవి. ఇక కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాలను కూడా ట్రంప్ వివిధ దేశాలతో కుదుర్చుకున్నారు. కొన్ని దేశాలతో స్నేహపూర్వకంగా మెలిగారు. మరికొన్ని దేశాలతో యుద్ధ వాతావరణం కొనసాగించారు. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ విధానాన్ని అయినా సరే ట్రంప్ తోసిపుచ్చారు. ఇప్పుడు మళ్లీ అమెరికాను అగ్ర పథం లో నిలబెడదామని ట్రంప్ ఎన్నికల సమయంలో పదేపదే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ మరొకసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత.. భారతదేశంలో సహా ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దౌత్యం, వలసలు, వాణిజ్యం, సైనిక సహకారం వంటివి ప్రధాన పాత్ర పోషిస్తాయని సమాచారం.
వర్తకం
భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఎన్నో సంవత్సరాల నుంచి సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అమెరికా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై అత్యధిక సుంకాలను విధిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. తాము కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదే విధంగా వసూలు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ జాబితాలో భారత్ కు మినహాయింపు లభించే అవకాశం ఉండకపోవచ్చు.. భారత్ గొప్ప దేశమని, మిత్ర దేశమని, మోడీ తనకు మంచి మిత్రుడని, గొప్ప నాయకుడని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పన్నుల విషయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రకారం చేసుకుంటే ట్రంప్ ఎలా వ్యవహరిస్తారు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
వీసాలు
మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగాల నిమిత్తం అనేకమంది వెళ్తుంటారు. హెచ్ -1 బీ వీసాల మీదుగా వారు అమెరికాకు వెళ్తుంటారు. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు ఇలా అమెరికాకు పంపిస్తుంటాయి. ఈ క్రమంలో ఈ విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమెరికా జీతాలతో సమానంగానే హెచ్ – 1 బీ వీసా దారులకు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది.
సైనిక ఒప్పందాలు
అమెరికా భారత్ మధ్య సైనిక ఒప్పందాలు ఎప్పటినుంచో ఉన్నాయి. బైడన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవే కాకుండా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నప్పటికీ పసిఫిక్ ప్రాంతంలో చైనా ను నిలువరించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే రెండు దేశాల మధ్య సైనిక సహకారం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రెండు దేశాల ఉమ్మడి లక్ష్యానికి క్వాడ్ కూటమి కూడా సహకరించే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో తన వాణి వినిపించిన ట్రంప్.. పాకిస్తాన్ తో చేస్తున్న పోరాటంలో భారత్ కు సహకరించవచ్చని తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A prediction of how the us india relations will be after trump wins the us presidency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com