https://oktelugu.com/

Russia-Ukraine War : రష్యా–ఉక్రెయిన్‌ వార్‌.. పుతిన్‌కు ఫోన్‌ చేసిన ట్రంప్‌.. కీలక వ్యాఖ్యలు!  

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే డొనాల్డ్‌ ట్రంప్‌.. పదవికి ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తన క్యాబినెట్‌ కూర్పులో బిజీగా ఉన్న ట్రంప్‌.. యుద్ధాలు ఆపడంపై దృష్టి పెడుతున్నారు. 

Written By: Raj Shekar, Updated On : November 15, 2024 5:01 pm
Russia-Ukraine War

Russia-Ukraine War

Follow us on

Russia-Ukraine War :  రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. అమెరికాతోపాటు నాటో దేశాల సాయంతో ఉక్రెయిన్‌ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఇక రష్యా కూడా ఉక్రెయిన్‌ను ఎలాగైనా దారికి తేవాలని చూస్తోంది. ఈ క్రమంలో యుద్ధానికి ముగింపు దొరకడం లేదు. భీకరంగా సాగుతోంది. రెండు దేశాల్లో ఇప్పటికే సామాన్యులు, సైనికులు వందల సంఖ్యలో మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా నూనత అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ యుద్ధానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఇప్పటికే పుతిన్‌తో మాట్లాడిన ట్రంప్‌  తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్‌ మొదటిసారిగా మార్‌ – ఎ – లాగో బహిరంగ కార్యక్రమంలో మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించానని తెలిపారు. అధికారం చేపట్టగానే యుద్ధాన్ని ఆపేస్తానని తెలిపారు. పశ్చిమాసియాలోనూ శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్నికల సమయంలోనే..
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే… రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల ప్రచార సమయంలో చాలాసార్లు తెలిపారు. యుద్ధాల కారణంగా అమెరికాకు ఆర్థికంగా నష్టం జరుగుతుందని వెల్లడించారు. అమెరికా ప్రజల సొమ్మును ఇతర దేశాల యుద్ధానికి ఖర్చు చేయడం సరికాదని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో యుద్ధానికి ముగింపు పలుకుతానని తెలిపారు. ఈ క్రమంలో గెలిచిన వెంటనే చర్యలు చేపట్టారు. ఇటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అటు రష్యా  అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ద్వారా యుద్దం ఆపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
యుద్ధం విస్తరించొద్దని..
ఇక తాజాగా పుతిన్‌కు ఫోన్‌ చేసిన ట్రంప్‌ యుద్ధాన్ని విస్తరించొద్దని కోరారు. ఇప్పటికే ఇరువైపులా వందల మంది మరణించిన నేపథ్యంలో యుద్ధం ఆపే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇందుకు అమెరికా తరఫున కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా బహిరంగ కార్యక్రమంలోనూ ఆయన యుద్ధం ఆపే విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరువైపులా దాడులు నిలిచిపోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి.
Tags