https://oktelugu.com/

Marriage: పెళ్లికి రెడీ అవుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

పెళ్లికి ముందే కొన్ని విషయాలను సరిగ్గా చర్చించుకుంటే వివాహం తర్వాత విడిపోయే పరిస్థితి పెద్దగా రాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో అర్థం చేసుకోకపోవడం వల్ల భాగస్వాముల మధ్య గొడవలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఏయే విషయాలను తెలుసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 15, 2024 9:19 pm
Marriage

Marriage

Follow us on

Marriage: పెళ్లి అనే బంధం చాలా ముఖ్యమైనది. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే జీవితాంత కలిసి ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడమే. పెళ్లికి ముందు ఆస్తులు, అంతస్తులు చూసుకుంటున్నారు. కానీ భాగస్వామి తనని ఎంత వరకు అర్థం చేసుకుంటున్నారో అనే విషయం మాత్రం ఆలోచించడం లేదు. దీనివల్ల పెళ్లయిన కొన్ని రోజులకు గొడవలు పడి విడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే చిన్న విషయాలకు కూడా కొందరు విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకునే వారి కంటే విడిపోయే వారి సంఖ్య ఈ రోజుల్లో పెరిగిపోతుంది. ప్రతీ చిన్న విషయానికి గొడవలు పెట్టుకుని విడిపోతున్నారు. అయితే పెళ్లికి ముందే కొన్ని విషయాలను సరిగ్గా చర్చించుకుంటే వివాహం తర్వాత విడిపోయే పరిస్థితి పెద్దగా రాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో అర్థం చేసుకోకపోవడం వల్ల భాగస్వాముల మధ్య గొడవలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఏయే విషయాలను తెలుసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

భాగస్వామి ఎలా ఉంటారు?
ప్రతీ అమ్మాయి లేదా అబ్బాయి తప్పకుండా కాబోయే భాగస్వామి గురించి తెలుసుకోవాలి. భాగస్వామికి ఇష్టమైనవి, లేనివి వంటి అన్ని విషయాలను కూడా ముందే తెలుసుకోవాలి. అలాగే పెళ్లయిన తర్వాత ఒకరి ఇష్టాయిష్టాలను కూడా గౌరవించుకోవాలని చెప్పుకోవాలి. ఇలా అన్ని విషయాలు మాట్లాడుకోవడం వల్ల ఇద్దరి మధ్య భవిష్యత్తులో గొడవలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చిన మళ్లీ అర్థం చేసుకుని కలిసిపోతారు. అలాగే ఇరు కుటుంబాల గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవడం వల్ల కుటుంబంలో గొడవలు వచ్చిన అవి మీ ఇద్దరి జీవితంపై పెద్దగా ప్రభావం చూపవు.

కుటుంబ బాధ్యతలు
కొందరికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. వీటి గురించి ముందే భాగస్వామికి చెప్పాలి. ఎందుకంటే పెళ్లయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంటిని, సోదరులు, బంధువులు ఇలా ఉన్న అన్ని బాధ్యతల గురించి అర్థమయ్యేటట్లు వివరించాలి. దీంతో వారు ఈ విషయాలపై గొడవ చేసే అవకాశం ఉండదు. అలాగే ఈరోజుల్లో చాలా మంది కుటుంబానికి దూరంగా ఉండటానికి ఇష్టపెట్టుకుంటున్నారు. పెళ్లయిన తర్వాత కుటుంబంతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటారా? లేకపోతే వేరుగా ఉంటారా? అనే విషయం కూడా ముందే చర్చించుకోవాలి. పెళ్లికి ముందే ఈ విషయాన్ని చర్చించుకుంటే.. ఇద్దరి అభిప్రాయం ఒకటి అయితే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే ముందే చేసుకోరు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలు ముందు చర్చించుకోండి.

సంతాన విషయంలో తప్పకుండా..
కొందరు అమ్మాయిలకు పెళ్లయిన వెంటనే పిల్లలకు జన్మనివ్వాలని ఉంటుంది. మరికొందరి అమ్మాయిలకు కాస్త సమయం తీసుకోవాలనిపిస్తుంది. దీనివల్ల ఇద్దరి మధ్య తప్పకుండా గొడవలు వస్తాయి. కాబట్టి పిల్లల ప్లానింగ్ ఎప్పుడని పెళ్లికి ముందే చర్చించుకోవడం మంచిది. లేకపోతే భవిష్యత్తులో ఈ విషయంపై గొడవలు వస్తాయి.

కెరీర్
భవిష్యత్తులో ఎదగడానికి ఏం చేయాలనుకుంటున్నారో ముందుగానే భార్యాభర్తలు చర్చించుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు అయితే కెరీర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొందరు అబ్బాయిలకు పెళ్లయిన తర్వాత అమ్మాయిలు ఉద్యోగం చేయడం పెద్దగా నచ్చదు. దీనివల్ల చాలా విషయాల్లో గొడవలు వస్తాయి. కాబట్టి ముందుగా ఈ విషయాన్ని అయితే చర్చించుకోవాలి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.