Sankranthi Movie Raviteja: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తుంటారు. అందువల్లే వాళ్ళ సినిమాలకు భారీగా క్రేజ్ దక్కుతోంది.ఇక ఇలాంటి క్రమంలోనే సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే చాలు చాలామంది పెద్ద హీరోలు తమ సినిమాలను పండక్కి రిలీజ్ చేస్తూ ప్రేక్షకులు ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ చిరంజీవి లాంటి హీరోలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక వీళ్ళ విషయం పక్కన పెడితే రవితేజ, శర్వానంద్ లాంటి హీరోలు సైతం కొంతకాలంగా ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి వీళ్ళిద్దరు ఈ సంక్రాంతికి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. ఒక వేళా ఫెయిల్యూర్ ని మూటగట్టుకుంటే వీళ్ళ మార్కెట్ ఎంతవరకు డౌన్ అయిపోతోంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంక్రాంతి వాళ్ళ కెరియర్ ని డిసైడ్ చేయబోతోంది అనేది వాస్తవం…
ఇక వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ సబ్జెక్టులే కావడం రెండింటికి ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకపోవడం కూడా ఈ సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతాయి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
ఆ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన కూడా ప్రేక్షకులు దానిని సక్సెస్ చేస్తారు. కాబట్టి రవితేజ, శర్వానంద్ ఇద్దరు ఈ సంవత్సరం ఎలాంటి సక్సెస్ ని మూటకట్టుకోబోతున్నారనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది… ఇక రవితేజ చేస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది. ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా కూడా ఇద్దరు అమ్మాయిల మధ్యన ఒక వ్యక్తి ఎలా నలిగిపోతాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే రెండు ఫ్యామిలీ సినిమాలే ఈ సినిమాల మధ్య పోటీ అనేది తీవ్రతరం అవుతోందా? లేదంటే రెండు సినిమాలు సక్సెస్ ఫుల్ గా నిలుస్తాయా? లేదంటే రెండు సినిమాలు ప్లాప్ లను మూటగట్టుకుంటాయా అనేది తెలియాలంటే మరో వారం రోజుల పాటు వేధి చూడాల్సిన అవసరమైతే ఉంది…