సిరియా అధ్యక్షుడిని చంపిద్దామనుకున్న… ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. ఎవరినో ఒకరిని ఇబ్బందుల పాటు చేయడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మొదటి నుంచి అలవాటే. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా .. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను సిరియా అధ్యక్షుడు బషర్‌‌ అల్‌ అసద్‌ను చంపించానుకున్నాడట. అటువంటి ఆలోచన లేదని గతంలో ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆలోచన చేసినట్టు అంగీకరించారు. […]

Written By: NARESH, Updated On : September 16, 2020 3:04 pm
Follow us on

ఎప్పుడూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. ఎవరినో ఒకరిని ఇబ్బందుల పాటు చేయడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మొదటి నుంచి అలవాటే. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా .. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను సిరియా అధ్యక్షుడు బషర్‌‌ అల్‌ అసద్‌ను చంపించానుకున్నాడట. అటువంటి ఆలోచన లేదని గతంలో ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఆలోచన చేసినట్టు అంగీకరించారు.

Also Read: నమో మోడీ.. వెన్నుచూపని భారతీయుడు

‘అసద్‌ను చంపిద్దామనుకున్నాను. ఈ విషయామై ఓ నిర్ణయానికి కూడా వచ్చాను.. కానీ మాటిస్ దీనికి అంగీకరించలేదు’ అని ట్రంప్ తెలిపారు. మాటిస్ కారణంగానే తాను వెనక్కి తగ్గానని వెల్లడించారు. జేమ్స్ మాటిస్ అప్పట్లో ట్రంప్ ప్రభుత్వంలో డిఫెన్స్ సెక్రెటరీగా సేవలందించారు. ‘నా దృష్టిలో మాటిస్ ఓ దారుణమైన సైనిక జనరల్. ఆయన నాయకత్వం కూడా తీసికట్టుగానే ఉంటుంది’ అని ట్రంప్ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అయితే అసద్‌ను చంపించాలనుకున్న నిర్ణయాన్ని అమలు చేయకపోవడంపై తానేమీ చింతించ్చట్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా జర్నలిస్టు బాబ్ వుడ్‌వర్డ్ 2018లో రాసిన పుస్తకంలో అసద్‌ను మట్టుపెట్టాలన్న ట్రంప్ ప్రణాళిక గురించి తొలిసారిగా ప్రస్తావించారు. 2017లో పౌరులపై జరిగిన రసాయనిక దాడికి అసద్ ప్రభుత్వమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాక ఆయన్ను మట్టుపెట్టేందుకు ఓ ప్రణాళిక వేయాలంటూ ట్రంప్ అప్పటి డిఫెన్స్ సెక్రెటరీ మాటిస్‌ను కోరారని వుడ్‌వర్డ్ తన పుస్తకంలో రాసుకున్నారు.

Also Read: న్యాయవ్యవస్థలోనూ అమరావతి భూకుంభకోణం లింకులు?

కానీ మాటిస్ ట్రంప్ డిమాండ్లను వ్యతిరేకించడంతో ఈ ప్లాన్‌కు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడిందని వుడ్ వర్డ్స్ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటివరకూ ఖండిస్తూ వచ్చిన ట్రంప్ మంగళవారం తొలిసారిగా అది వాస్తవేమనని అంగీకరించరించడం ఆశ్చర్యం వేసింది.